AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz: మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో షేర్ చేస్తూ పేరు చెప్పేసింది..

ఇలియానాకు కాబోయే భర్త పేరు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ అని తెలుస్తోంది.. ఈ గోవా బ్యూటీకి బాబు జన్మించడంతో నర్గీస్ ఫక్రీ, కరణ్‌వీర్ శర్మ, అతియా శెట్టి, సోఫీ చౌదరి, హుమా ఖురేషీతో సహా పలువురు ప్రముఖులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది.

Ileana D'Cruz: మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో షేర్ చేస్తూ పేరు చెప్పేసింది..
Ileana
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 1:13 AM

Share

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆగస్ట్ 1న తనకు బాబు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. తన కొడుకు పేరును రివీల్ చేయడమే కాదు.. ఏకంగా అబ్బాయి పిక్ షేర్ చేసింది. “మా ప్రియమైన అబ్బాయి కోవా ఫీనిక్స్ డోలన్ ను పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మటల్లో చెప్పలేము.”అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

తాను తల్లిని కాబోతున్నట్లు గతంలో ఇన్ స్టా వేదికగా అనౌన్స్ చేసింది ఇలియానా. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంది. అయితే ఇలియానా పెళ్లి కాకుండా తల్లి అవుతున్నట్లు ప్రకటించడంతో నెటిజన్స్ షాకయ్యారు. ఆ తర్వాత చాలా రోజులు తనకు కాబోయే భర్త గురించి సస్పెన్స్ మెయింటెన్ చేసిన ఈ బ్యూటీ.. కొద్దిరోజుల క్రితం అతడిని అభిమానులకు పరిచయం చేసింది.

ఇలియానాకు కాబోయే భర్త పేరు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ అని తెలుస్తోంది.. ఈ గోవా బ్యూటీకి బాబు జన్మించడంతో నర్గీస్ ఫక్రీ, కరణ్‌వీర్ శర్మ, అతియా శెట్టి, సోఫీ చౌదరి, హుమా ఖురేషీతో సహా పలువురు ప్రముఖులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఈ బ్యూటీ చివరిసారిగా 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ లో కనిపించింది. ఇటీవలే ఆమె అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ అనే కామెడీ చిత్రంలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ హీరో చెన్నై నవాబు.. ఆస్తులు చూసుకునేందుకే మేనేజర్లు ఉండేవారు..
ఆ హీరో చెన్నై నవాబు.. ఆస్తులు చూసుకునేందుకే మేనేజర్లు ఉండేవారు..
ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2027 ఫీజు గడువు పొడిగింపు..
ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2027 ఫీజు గడువు పొడిగింపు..
శనివారం ఈ 5 వస్తువులను దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం..
శనివారం ఈ 5 వస్తువులను దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం..
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో ముప్పు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో ముప్పు..
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భారత్‌ ఏవియేషన్‌ హెలికాప్టర్
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భారత్‌ ఏవియేషన్‌ హెలికాప్టర్
NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..