నేను ఏతప్పూ చేయలేదు.. దుర్గమ్మే కాపాడింది.. కన్నీళ్లు పెట్టుకున్న హేమ

హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సింపుల్ గా హేమగా మార్చుకుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్ ల క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ అందాల తార. 250 కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది హేమ. అయితే సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపించింది.

నేను ఏతప్పూ చేయలేదు.. దుర్గమ్మే కాపాడింది.. కన్నీళ్లు పెట్టుకున్న హేమ
Hema

Updated on: Oct 01, 2025 | 9:52 AM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ. హేమ తన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను నవ్వించేవి. అతడు సినిమాలో ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే సిద్దార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకుంది హేమ. హేమ అసలు పేరు కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా మార్చుకుంది.

హేమ 250 పైగా సినిమాల్లో నటించింది.  వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. మా ఎలక్షన్స్ సమయంలో హేమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక రీసెంట్‌గా రీవ్ పార్టీలో హేమ పాల్గొందన్న ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. అంతే కాదు ఆమె డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ దీనిని హేమ ఖండించారు. తన పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం హేమకు సినిమా ఆఫర్స్ తగ్గాయి.

తాజాగా ఆమె విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాగా దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన హేమ ఆలయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను అనవసరంగా ఇరికించారని.. కావాలనే తనను బలి చేశారని చెప్తూ ఎమోషనల్ అయ్యారు హేమ.. ఈ రోజు నేను దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చాను.. కానీ ఈసారి చాలా ప్రత్యేకం.. దుర్గమ్మ నన్ను బ్రతికించింది. గతేడాది మీరందరూ నాపై వేసిన నిందులన్నింటిని దుర్గమ్మ తుడిచిపెట్టిందని అన్నారు హేమ. చేయని తప్పునకు అందరూ నన్ను బలి చేశారు. కానీ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను తన గుడికి వచ్చేటట్లు ఆ దుర్గమ్మే చేసింది.. అమ్మేకాపాడింది. కానీ దాని నుంచి బయటపడటం నా వల్ల కాలేదు. ప్రతిక్షణం దుర్గమ్మ తల్లి.. నేనున్నాను.. నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికించింది అని అన్నారు హేమ.. అలాగే ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోండి. ఈ రోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను. ఏ ఎలాంటి తప్పు చేయలేదు.. అంటూ ఎమోషనల్ అయ్యారు హేమ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.