
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు హేమ. తన నటనతో తోపాటు నవ్వులు పూయించి మెప్పించారు హేమ.. సహాయక పాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే పేర్లలో హేమ మొదటి వరసలో ఉంటారు. కోవై సరళ తర్వాత ఆ రేంజ్‌లో కామెడీ పండించారు హేమ. ముఖ్యంగా బ్రహ్మానందం తో కలిసి ఆమె నటించిన సినిమాలు, సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల హేమ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో హేమ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో తాను ఎదుర్కొన్న కష్టాల అనంతరం ప్రజల నుంచి, అభిమానుల నుంచి అపారమైన మద్దతు లభించిందని అన్నారు హేమ. దేవాలయాల్లో తన కోసం పూజలు చేయించిన అభిమానుల ఆశీస్సుల వల్లే తాను క్లీన్ చిట్‌తో బయటపడగలిగానని ఆమె అన్నారు. ఈ అనుభవమే మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరికను రేకెత్తించిందని హేమ అన్నారు.
తాను కేవలం తల్లి, అక్క పాత్రలకే పరిమితం కాకుండా డైలాగ్స్ ఉండి, మంచి పాత్రలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను తాను ఇండస్ట్రీలో తన గాడ్‌ఫాదర్‌గా భావిస్తానని, ఏ ఇష్యూ వచ్చినా ఆయనతో మాట్లాడతానని తెలిపారు. నాగార్జునతో వ్యాపార విషయాలపై చర్చిస్తానని చెప్పారు. బాలకృష్ణ తన కుమార్తె ఈషా పుట్టినప్పుడు ఇంటికి వచ్చి ఆశీర్వదించారని, ఆ సంఘటన తనకు జీవితంలో మరచిపోలేనిదని పేర్కొన్నారు. చిరంజీవి తన ఇంట్లో ఎస్పీ పరశురామ్ సినిమా షూటింగ్ సమయంలో దుస్తులు మార్చుకోవడానికి వచ్చి, తాను స్వయంగా చేసిన కాఫీ తాగి వెళ్లారని, ఆ రోజు తనకు చాలా సంతోషం కలిగిందని తెలిపారు.. నాగార్జున స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు తన ఇంటికి లంచ్ కోసం వచ్చారని, ఆయనకు ఇష్టమైన చేపల పులుసు, ఆవకాయ పచ్చడి వంటివి చేసి వడ్డించానని గుర్తు చేసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలనిపిస్తే ఆయన మేనేజర్‌కు కబురు పంపిస్తే, తన ఇంటికే వచ్చారని హేమ తెలిపారు. కే. రాఘవేంద్ర రావు కూడా తనకు ఫోన్ చేసి, ఐస్ బాత్, డోపమైన్ వంటి విషయాలపై తన ధైర్యాన్ని అభినందించారని, తన కేస్ క్వాష్ అయినందుకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. ప్రభాస్ కజిన్ తనకు సన్నిహితుడని, ఎప్పుడైనా అవసరమైతే ప్రభాస్‌ను కలవగలనని హేమ ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి, తల్లి, అక్క, బావ, శత్రువులు, మిత్రులు అందరూ ఇక్కడే, అంటే సినీ పరిశ్రమలోనే ఉన్నారని, ఇది తన అడ్డా అని హేమ అన్నారు. బాలకృష్ణ, నాగార్జునలను తాను బాబు అని మిలుస్తానని, మహేష్ బాబును మహీ అని, ప్రభాస్‌ను డార్లింగ్ అని పిలుస్తానని తెలిపారు హేమ. నూతన సంవత్సర పండుగలు ముగిసిన వెంటనే దర్శకులను, నిర్మాతలను కలిసి అవకాశాలను తిరిగి అందిపుచ్చుకుంటానని హేమ స్పష్టం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..