Harini Sundarajan: మీకు నచ్చకపోతే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ?.. ‘ట్రూ లవర్’ నటి ఎమోషనల్ పోస్ట్..

గతేడాది రిలీజ్ అయిన గుడ్ నైట్ మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో మణికందన్. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా లవర్. ఇందులో శ్రీగౌరీ ప్రియ కథానాయికగా నటించిచంది. ఫిబ్రవరి 9న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ట్రూ లవర్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ భారీ కలెక్షన్స్ రాబట్టింది.

Harini Sundarajan: మీకు నచ్చకపోతే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ?.. ట్రూ లవర్ నటి ఎమోషనల్ పోస్ట్..
Harini Sundarajan

Updated on: Apr 11, 2024 | 6:09 PM

కొన్నాళ్లుగా తమిళ్, మలయాళం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేమలు మూవీ సూపర్ హిట్ కాగా.. ప్రస్తుతం మంజుమ్మేల్ బాయ్స్ సెన్సెషన్ అవుతుంది. అలాగే గతేడాది రిలీజ్ అయిన గుడ్ నైట్ మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో మణికందన్. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా లవర్. ఇందులో శ్రీగౌరీ ప్రియ కథానాయికగా నటించిచంది. ఫిబ్రవరి 9న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ట్రూ లవర్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ మార్చి 27నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇందులో హీరోయిన్ స్నేహితురాలు ఐషు పాత్రలో నటించిన హరిణి సుందరరాజన్ పై మాత్రం పూర్తిగా నెగిటివిటి వచ్చేసింది.

ఇందులో ఆమె పోషించిన పాత్రను ట్రోల్ చేస్తూ దారణంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసింది హరిణి. అడియన్స్ తన పై కోపం చూపించడం కరెక్ట్ కాదని తెలిపింది. “ఈ రోజు ఉదయం, నా DM లలో కొంతమంది మూర్ఖులు నన్ను తిట్టడం వల్ల నేను నిద్రలేచాను. ఎందుకంటే వారికి లవర్ సినిమాలోని ఐషు పాత్ర ఇష్టం లేదు. కానీ ముందు మీరు తెలుసుకోవాల్సింది ఇలా నీచంగా, అగౌరవంగా మాట్లాడటం కరెక్ట్ కాదని. ఒక నటుడు లేదా నటి పోషించిన పాత్ర నచ్చకపోతే మమ్మల్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్. ఐషు పాత్ర లవర్ సినిమాలోని ఓ పాత్రమే అని.. అందుకు ఇంత అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ” అంటూ మండిపడింది. హరిణి ట్వీట్స్ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు కొందరు నెటిజన్స్.

అసలు విషయానికి వస్తే..
ట్రూలవర్ సినిమాలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ).. అరుణ్ (మణికందన్) దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉంటారు. కానీ దివ్య తనను మోసం చేస్తుందేమో అన్న అభద్రతభావంతో నిత్యం ఆమెను అనుమానిస్తూ వేధిస్తుంటాడు. దీంతో అతడికి చాలాసార్లు బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్న దివ్య.. చివరకు అతడు క్షమాపణ చెప్పడంతో ఊరుకుంటుంది. కానీ అరుణ్ ప్రవర్తనతో మానసికంగా కృంగిపోతుంది. దివ్య పరిస్థితిని గమనించిన ఆమె ప్రాణ స్నేహితురాలు అరుణ్‏ను వదిలేయాలని.. అతడికి బ్రేకప్ చెప్పాలని సలహా ఇస్తుంది. దీంతో దివ్య అరుణ్ నుంచి విడిపోతుంది. దీంతో ఐషు పాత్రపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఇద్దరు ప్రేమికులను విడదీశావని.. ప్రేమజంటకు అనవసరమైన సమస్యలు సృష్టించావంటూ నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దీంతో తనపై వస్తున్న కామెంట్లకు గట్టిగానే ఇచ్చిపడేసింది హరిణి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.