
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ మహామ్మారి బారిన పడింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ హంసానందిని. మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన ఈ అమ్మడు.. 2004లో ఒక్కటవుదాం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా మాత్రం వంశీ అనుమానాస్పదం. ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ వంటి చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ అలరించింది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సొగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవుకుశ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 2018లో చివరగా గోపిచంద్ నటించిన పంతం చిత్రంలో నటించింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించాల్సిన ఆమె.. అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. అదే సమయంలో తనకు క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించింది. ఆ సమస్యకు చాలా కాలం పాటు చికిత్స తీసుకుంది. దాదాపు 16 కీమో థెరపీలు చేయించుకుంది. క్యాన్సర్ నుంచి బయటపడిన హంసానందిని.. ఇప్పుడు తాజాగా ఓ పోస్ట్ చేసింది.
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..
“దృఢమైన వెన్నెముక, మృదువైన హృదయం, గట్టిగా నవ్వే నవ్వు.. నేను మళ్లీ మళ్లీ బ్రేక్ అయ్యాను. అయినా సరే నన్ను నేను నిర్మించుకున్నాను. మళ్లీ కొత్తగా జన్మించాను” అంటూ తన జీవిత పోరాటం గురించి రాసుకొచ్చింది. ఇక దాదాపు 16 సైకిళ్ల కీమోథెరపీ సర్జరీల తర్వాత ఆ మహమ్మారిని జయించాను.. ముక్కలైన జీవితాన్ని మళ్లీ ధైర్యంతో నిర్మించుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం హంసానందిని చేసిన పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్