అలాంటి సినిమాల్లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తా.. మనసులో మాట బయటపెట్టిన ఫరియా అద్భుల్లా

టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అద్బుల్లా.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ సుందరి. ఆతర్వాత పెద్దగా సక్సెస్ సాదించలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పెద్దగా లాభం లేకుండా పోతుంది.

అలాంటి సినిమాల్లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తా.. మనసులో మాట బయటపెట్టిన ఫరియా అద్భుల్లా
Faria Abdullah

Updated on: May 08, 2026 | 10:01 PM

అందాల భామ ఫరియా అద్భుల్లా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ అందాల తార. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే భగవంతుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరియా అద్బుల్లా ఆసక్తికర విషయాలను పంచుకుంది. నటి తన కెరీర్ ప్రయాణంలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసే చిత్రాలు, స్టార్‌డమ్‌పై కాకుండా తన సృజనాత్మక ప్రాధాన్యతలకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అధిక పారితోషికం, కమర్షియల్ విజయం ఒకవైపు ఉన్నప్పటికీ, ఆమె తన ప్రత్యేకమైన మైండ్‌సెట్‌తో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.

ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది

ఫరియా మాట్లాడుతూ.. వంద కోట్ల సినిమా ఆఫర్ వస్తే నేనెందుకు చేయను. ? చేస్తాను కదా,” అని నవ్వుతూ చెప్పింది.  చిట్టి వంటి పాత్రల ద్వారా వచ్చిన అభిమానుల ఆదరణే తన నిజమైన ప్రేరణ అని ఆమె తెలిపింది.. జాతిరత్నాలు చిత్రంలో చిట్టి పాత్రకు డబ్బింగ్ చెప్పిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రానికి ఎంపికయ్యే సమయానికి ఆమెకు తెలుగు సరిగా రాదని చెప్పింది. అయినా, తన వాయిస్‌కి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. షూటింగ్ సమయంలో తెలుగు మాట్లాడే వారితో కలిసి ఉండటం ద్వారా భాషను నేర్చుకున్నానని, స్టేజ్‌పై ధైర్యంగా మాట్లాడగలిగానని ఆమె చెప్పుకొచ్చింది. ఇది కేవలం ఆమె నటనకు మాత్రమే కాకుండా, ఆమె వాయిస్‌కి కూడా లభించిన ప్రశంస అని తెలిపింది.

ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

తన తాజా చిత్రం గాయపడ్డ సింహం గురించి మాట్లాడుతూ..  తన పాత్ర పరిచయ సన్నివేశం ఎలా ఉండేదో వెల్లడించారు. తాను స్టేజ్‌పై చాలా “చెత్తగా” డ్యాన్స్ చేస్తుండగా, హీరో తన స్నేహితుడితో “ఇంత చెత్తగా డ్యాన్స్ చేస్తుందంటే కచ్చితంగా నాకు పడుద్దిరా” అని చెప్పే సన్నివేశాన్ని ఆమె పంచుకుంది. ఈ జోక్ వినగానే తాను ఈ పాత్ర చేయడానికి అంగీకరించానని తెలిపింది. గాయపడ్డ సింహం సినిమా విషయంలో తనకు నమ్మకాన్ని కలిగించిన అంశాలను వివరిస్తూ, తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి ఓకే చెప్పడం ప్రధాన కారణమని.. పవన్ సాధినేని డైరెక్టర్‌ను, కథను సిఫార్సు చేయడంతో పాటు, ఒక ప్లాట్‌లైన్ వినగానే ఇది కామెడీగా ఉంటుందని, ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని భావించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us