Chandini Chowdary: ఐపీఎల్ టీం మీద కామెంట్స్.. ట్రోలింగ్ పై రియాక్ట్ అయిన హీరోయిన్..

|

Apr 30, 2024 | 7:04 AM

ఇటీవలే విశ్వక్ సేన్ సరసన గామి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో మరోసారి తెలుగమ్మాయి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుుడు మ్యూజిక్ షాపు మూర్తి సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న చాందిని.. ఐపీఎల్ టీం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు అవే మాటలను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Chandini Chowdary: ఐపీఎల్ టీం మీద కామెంట్స్.. ట్రోలింగ్ పై రియాక్ట్ అయిన హీరోయిన్..
Chandini Chowdary
Follow us on

టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది చాందిని చౌదరి. ఈ సినిమాతోనే హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటిగా మంచి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాందిని.. కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి కష్టమైన పాత్రలు చేయడానికైనా ముందుంటుంది. చాందిని సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. ఇక ఇటీవలే విశ్వక్ సేన్ సరసన గామి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో మరోసారి తెలుగమ్మాయి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుుడు మ్యూజిక్ షాపు మూర్తి సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న చాందిని.. ఐపీఎల్ టీం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు అవే మాటలను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

మ్యూజిక్ షాపు మూర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఏ ఐపీఎల్ టీంను సపోర్ట్ చేస్తారు అని అడగ్గా.. చాందిని రియాక్ట్ అవుతూ.. తాను ఎక్కువగా క్రికెట్ చూడనని చెప్పింది. తాను ఆంధ్ర అని.. తమ రాష్ట్రానికి టీం లేదు కదా.. ఉంటే దానికే సపోర్ట్ చేసేదాన్ని అంటూ కాస్త వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చింది. అయితే ఇక ఇప్పుడు చాందిని మాట్లాడిన మాటలపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అలాగే ఆమె చేసిన కామెంట్లను ట్రోల్ చేస్తున్నారు. ఉండేది ఇక్కడ.. సినిమాలు తీసుకునేది .. చేసుకునేది ఇక్కడా.. కానీ మన టీంను సపోర్ట్ చేయడం లేదు.. మీరు ఏపీ కదా.. ఇక్కడేందుకు సినిమాలు చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా తన మాటలపై వివరణ ఇచ్చింది చాందిని. ఏపీకి కూడా ఒక టీం ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అలా కామెంట్స్ చేశానని.. కానీ ట్రెండింగ్ కోసమే కొంతమంది ఇలా కట్ చేసి ఎడిట్ చేసుకుంటున్నారని.. వాళ్లకు నచ్చినట్లుగా ఆ వీడియోను మార్చుకుంటున్నారని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని కాబట్టి రెండు రాష్ట్రాలంటే తనకు చాలా గర్వంగా ఉందని.. ఎస్ఆర్హెచ్ టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్రోలింగ్ కు ఫుల్ స్టా్ప్ పెట్టే ప్రయత్నం చేసింది. చూడాలి మరీ చాందిని పై ట్రోలింగ్ ఇప్పుడైనా ఆగుతుందేమో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.