Toxic Movie: ఒక్క సీన్‌తో సెన్సేషన్.. ఇప్పుడేమో ఇలా! ‘టాక్సిక్’ నటి సంచలన నిర్ణయం వెనక కారణమిదేనా?
రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఇంటిమేట్ సీన్స్ లో నటించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ లోని బోల్డ్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఇంటిమేట్ సీన్స్ లో నటించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
‘టాక్సిక్’ సినిమా టీజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఈ టీజర్ హాలీవుడ్ లెవెల్ లో ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే సమయంలో ఇందులోని బోల్డ్ సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టాక్సిక్ టీజర్ లోని బోల్డ్ సీన్స్ లో కనిపించిన నటి పేరు నటాలీ బర్న్ అని మొదట ప్రచారం జరిగింది. అయితే దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దీనిని తప్పుపుట్టింది. ఆ నటి పేరు బీట్రీజ్ టోఫెన్ బాఖ్ అని క్లారిటీ ఇచ్చింది. కాగా టీజర్ రిలీజ్ తర్వాత నటిపై విమర్శలు వెల్లువెత్తాయి. అసభ్యకర సందేశాలు కూడా వచ్చినట్లు సమాచారం. దీనితో కలత చెందిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా తొలగించింది. హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు సాధారణం. ఎవరూ కూడా వాటిని విమర్శించరు. అయితే భారతీయ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూపించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.
ఈ క్రమంలోనే టాక్సిక్ టీజర్ లో కనిపించిన నటి బీట్రీజ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని కారణంగా ఆమె తన ఖాతాను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. ‘టాక్సిక్’ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ‘టాక్సిక్’ టీజర్‌లో నటిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. టీజర్‌లో ఉన్న నటి నటాలీ బర్న్ కాదని, నటి బీట్రిజ్ టఫెబాక్ అని ఇటీవల చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా బీట్రిజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా ఉంచింది. ఇప్పుడు పూర్తిగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ‘టాక్సిక్’ సినిమా టీజర్‌లోని బోల్డ్ సన్నివేశాలకు సంబంధించి సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. అయితే, యూట్యూబ్, సోషల్ మీడియాలో విడుదల చేసే కంటెంట్‌పై తమకు ఎటువంటి అధికారం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో ప్రదర్శించబడే చిత్రాలకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తామని బోర్డు తెలిపింది.
టాక్సిక్ సినిమా టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




