ఉయ్యాలైన జంపాలైనా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ అవికాగోర్. ఈ సినిమాతర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ముందుకు రాబోతోంది.. అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. మురళి గంధం ఏ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా బుధవారం రోజున ‘మది విహంగమయ్యే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు హీరో నాగ చైతన్య. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో మది విహంగమయ్యే.. పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా చక్కగా ఆలపించారు.
సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’’ అన్నారు. అలాగే హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘‘సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారు. ఇక చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుంది’’ అన్నారు.