Actress: ఆ ఇంటర్వ్యూ తర్వాత నా పరిస్థితి.. అస్సలు ఊహించలేదు.! ఓపెన్‌గా చెప్పేసిన క్రేజీ హీరోయిన్

ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి వైరల్ అయిన బుల్లితెర నటి ఆషూరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఆ ఇంటర్వ్యూ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Actress: ఆ ఇంటర్వ్యూ తర్వాత నా పరిస్థితి.. అస్సలు ఊహించలేదు.! ఓపెన్‌గా చెప్పేసిన క్రేజీ హీరోయిన్
Actress

Updated on: Dec 27, 2025 | 12:06 PM

నటి ఆషూరెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకుంది. తన బిగ్ బాస్ ప్రయాణం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్‌తో మర్చిపోలేని అనుభవాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘హాట్’ అనే పదంపై స్పందించిన ఆమె.. దానిని కాంప్లిమెంట్‌గా భావిస్తానని, అమ్మాయిలకు అలాంటి ప్రశంసలు ఇష్టమేనని అషూ రెడ్డి తెలిపింది. బిగ్ బాస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘అది నా జీవితాన్ని మార్చిన ఓ అద్భుతమైన అవకాశం’ అని అషూ పేర్కొంది. అమెరికాలో 9 టూ 5 కంప్యూటర్ ఉద్యోగం చేసేటప్పుడు, వ్యక్తిగత సమస్యల నుంచి తప్పించుకోవడానికి బిగ్ బాస్‌ను ఒక మార్గంగా ఎంచుకున్నానని పేర్కొంది. ఆ షో ద్వారా తాను శారీరకంగా, మానసికంగా మారానని.. తన బలాలు, బలహీనతలపై స్పష్టత వచ్చిందని.. తనకు ఏం కావాలో ఇప్పుడు తెలిసిందని అషూ రెడ్డి వివరించింది.

అప్పట్లో ఆర్జీవీతో ఆషూరెడ్డి చేసిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆషూరెడ్డి కాళ్లను వర్మ కిస్ చేయగా.. ఆ సీన్‌ను షేర్ చేస్తూ.. ఇప్పటికీ వర్మను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక దాని గురించి మాట్లాడిన ఆషూ.. అది పూర్తిగా స్క్రిప్టెడ్ అని చెప్పింది. చాలామంది ఆ ఇంటర్వ్యూలో అన్ని కూడా మా సొంత మాటలు అని అనుకున్నప్పటికీ.. దాని వెనుక ఓ ప్రణాళిక ఉందని ఆమె తెలిపింది. తాను ఆ ఇంటర్వ్యూ అలా జరుగుతుందని ఊహించలేదని.. మా పేరెంట్స్ దగ్గర నుంచి చుట్టుప్రక్కల వారి వరకు అందరికీ నెగటివ్‌గా వెళ్లిందని తెలిపింది. అయితే అది నా కెరీర్‌లో ఒక ప్రాజెక్ట్ మాదిరిగానే చూస్తానని, దాని తర్వాత ఆర్జీవీకి, తనకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని అషూ పేర్కొంది. అలాగే పవన్ కళ్యాణ్‌తో తన ప్రత్యేక అనుభవాన్ని పంచుకుంటూ, హరి హర వీరమల్లు షూటింగ్ సమయంలో సారథి స్టూడియోలో ఆయనను కలిసే అవకాశం లభించిందని లభించిందని అషూ తెలిపింది. 2018లో తాను చూపించిన ఒక టాటూను గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తనను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె చెప్పింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఆయన తనతో చాలా క్యాజువల్‌గా, ఒక ఫ్రెండ్‌లా, మెంటర్‌లా మాట్లాడారని అషూ గుర్తుచేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..