డైరెక్టర్ త్రివిక్రమ్, యంగ్ హీరో నితిన్ కాంబోలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు, రౌడీ బాయ్స్ అంటే సుందరానికీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కార్తికేయ 2, 18 పేజేస్, బట్టర్ ఫ్లై చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే షూటింగ్ కంప్లాట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది కార్తికేయ 2. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ అచ్చ తెనుగింటి ముద్దుగుమ్మగా కనిపించిన అనుపమ ఇప్పుడు రూటు మార్చింది.
గ్లామర్ డోస్ పెంచి ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా బ్యాక్ లెస్ ట్రెండీ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. మొదటి సారి అనుపమ గ్లామర్ ఫోటోస్ షేర్ చేయండంతో ఆమె అభిమానులు షాకవుతున్నారు. అలాగే.. ” అతనికి తెలుసు ఏ సమయంలో నిన్ను నవ్వించాలి..స్పైస్ చేయాలి అని” అంటూ క్యాప్షన్ ఇస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. అయితే అనుపమ షేర్ చేసిన ఫోటోలకు కొందరు సూపర్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం నీకు సెట్ కాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ అచ్చ తెలుగు ఆడపిల్లగా కనిపించే అనుపమ.. ఇక ఇప్పుడు రూటు చేంజ్ చేసిందనే చెప్పుకొవాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.