AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నతనంలోనే లైంగిక వేదింపులకు గురయ్యా.. ఆండ్రియా షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది స్పందించారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తాను లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపింది. అంతే కాదు చిన్న వయసులోనే లైగిక వేధింపులు ఎదుర్కొన్నా.. అదికూడా మా నాన్న ముందే ఇది జరిగింది అని తెలిపింది. ఇండస్ట్రీలో అందాల భామల్లో ఆండ్రియా జర్మియా ఒకరు. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమాలోకి అడుగు పెట్టింది.

చిన్నతనంలోనే లైంగిక వేదింపులకు గురయ్యా.. ఆండ్రియా షాకింగ్ కామెంట్స్
Andrea Jeremiah
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2024 | 9:46 AM

Share

ఇండస్ట్రీకి చెందిన చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే.సినిమాల్లో అవకాశాల కోసం కొంతమంది లైగింక వేధింపులకు గురైతే మరికొంతమంది చనున్న తనంలోనే లైంగిక వేధింపులకు గురైన వారు కూడా ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది స్పందించారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తాను లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపింది. అంతే కాదు చిన్న వయసులోనే లైగిక వేధింపులు ఎదుర్కొన్నా.. అదికూడా మా నాన్న ముందే ఇది జరిగింది అని తెలిపింది. ఇండస్ట్రీలో అందాల భామల్లో ఆండ్రియా జర్మియా ఒకరు. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమాలోకి అడుగు పెట్టింది. తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే ట్రూప్లో పాటలు పాడుతోంది. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే సింగర్ గాను తన టాలెంట్ నిరూపించుకుంటుంది ఈ బ్యూటీ. తమిళ్ లో హీరోయిన్ గా చేస్తూనే కీలక పాత్రల్లోనూ నటిస్తుంది. కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాతో బాగా పాపులర్ అయ్యింది ఆండ్రియా. ఇక  ఈ ఏడాది విడుదలైన సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

తాజాగా ఆండ్రియా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. చిన్న వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా అని తెలిపింది. తన 11 ఏళ్ల వయసులో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా అని తెలిపింది. చిన్న తనంలో తన పేరెంట్స్ తో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు.. నేను మా నాన్న సీటుకు కొంచం దూరంలో ఉన్న సీట్ లో కూర్చున్న అప్పుడు నేను జీన్స్, టీషర్ట్ వేసుకున్నా.. ఆ సమయంలో ఎవరో నా టీ షార్ట్ లో చేయిపెట్టారు. దాంతో నాకు ఏం జరిగిందో అర్ధంకూడా కాలేదు. బయపడి ఏడ్చేశా.. వెంటనే లేచి వెళ్లి మా నాన్న పక్కన కూర్చున్నా అని తెలిపింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us