స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆలీయా భట్ (Alia Bhatt). ఈ సినిమాలో నటన పరంగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆలీయా.. హైవే.. , 2 స్టేట్స్, హంప్టీ శర్మ కి దుల్హానియా, ఉడ్తా పంజాబ్, బద్రినాథ్ కీ దుల్హనియా.. గల్లీ భాయ్ వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో బీటౌన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది ఆలీయా. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఆలీయా భట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయి కతీయావాడీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలీయా, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా.. ఆలీయా భట్.. టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు మీకోసం..
రిపోర్టర్: గంగూభాయి కతీయావాడీ షూటింగ్‌లో ఎప్పుడైనా గుజరాత్ ఫుడ్స్ టేస్ట్ చేశారా.?
ఆలీయా: డోక్లా, ఖండ్వి, గుజరాతీ మీటీ దాల్ లాంటి పలు గుజరాత్ వంటకాలు అప్పుడప్పుడూ సంజయ్ సర్ ఇంటి నుంచి సెట్స్‌లోకి వచ్చేవి. అప్పుడే టేస్ట్ చేశాను.
రిపోర్టర్: ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
ఆలీయా: ఈ సినిమా షూటింగ్ సమయలో నాకు సంజయ్ సర్ ఒక రూల్ పెట్టారు. ఇలాంటివి తినకు అని ఎప్పుడూ రూల్ పాస్ చేయలేదు. సరిగ్గా తిని.. షూటింగ్‌లో చలాకిగా ఉండాలని చెప్పారు.
రిపోర్టర్: ట్రైలర్ బాగుంది. మీ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ?
ఆలీయా: ఈ సినిమా కమాటీపూరా అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. దాని గురించి న్యూస్, ఇతరత్రా వాటి నుంచి తెలుసుకున్నా. గంగూభాయ్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ గంగూభాయ్ అనే మహిళ నివసించేది అని సెక్స్ వర్కర్స్, అక్కడ నివసించే మహిళల కోసం, వారి హక్కుల కోసం, వారి పిల్లల చదువుల కోసం సమాజంతో పోరాడిందని తెలుసుకున్నాను. ఆమె పడిన కష్టాలన్ని వెండితెరపై చూపించడంతోపాటు.. అక్కడ నివసించే మహిళలు ఎలా ఆలోచిస్తారు. ఎలాంటి కలలు, ఆశలు ఉంటాయనేది సమాజానికి చూపించాలని ఆమె తాపత్రాయపడేది. అదే విషయాన్ని మేము వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం.
రిపోర్టర్: డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో మీకు ఇదే మొదటి సినిమా.. ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది ?
ఆలీయా: ఆయనతో వర్క్ చేయడం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. రెండేళ్లు ఈ క్యారెక్టర్‌లో జీవించాను. షూటింగ్ అయిన తర్వాత కూడా మరో ఏడాది పాటు ఈ క్యారెక్టర్‌తోనె కలిసి ఉన్నాను. కోవిడ్ వల్ల థియేటర్స్ బంద్ కావడంతో రిలీజ్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని అనుకున్నాం. అందుకే మేము ఈ సినిమాను థియేటర్స్‌లోని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. సంజయ్ సర్ ఓ మెజీషియన్. ఆయన సినిమాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతారు. ఆయన సినిమాలోని ప్రతి డైలాగ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేవిగా ఉంటాయి.ఈ పాత్రను పోషించడం కంటే.. పాత్ర డైలాగ్స్ చెప్పడమే నాకు పెద్ద సవాలుగా అనిపించింది. ఈ షూటింగ్ లో ప్రతీ రోజూ నాకు మరుపురానిది.
రిపోర్టర్: ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ చేసిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడ్డారు.!
ఆలీయా: థియేటర్ లో ఫిల్మ్ రిలీజ్ అయ్యేవరకు నా సందేహాం తీరదు. ఈ సినిమా విడుదలైన ఒక వారం తర్వాత సినిమాను ప్రజలు ఎలా ఆదరించారు అనే విషయం తెలిసేవరకు నేను గంగూభాయి పాత్ర నుంచి బయటకు రాలేను.. అప్పుడే నాకు గంగూభాయి పాత్ర నుంచి ఆలీయాగా మారిపోతాను. ఈ సినిమా కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను.. గంగూభాయి పాత్ర నా మనసుకు హత్తుకుంది.
రిపోర్టర్: అజయ్ దేవగన్ తో మొదటిసారి స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది ?
ఆలీయా: ఆయనతో పని చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్ పీరియన్స్. సూపర్ స్టార్ అయినప్పటికీ డౌన్ టూ ఎర్త్. తొందరగా పని పూర్తి చేయాలని అనుకోరు. చాలా శ్రద్దగా పని జరగాలని.. ప్రతి సీన్ అద్భుతంగా రావడానికి కావల్సినంత సమయాన్ని కేటాయిస్తారు. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆడిషన్స్ కి వచ్చి సలహాలు ఇచ్చారు.
రిపోర్టర్: బ్రహ్మాస్త్రా సినిమా గురించి పలు విషయాలు చెప్పండి ? ..
ఆలీయా: ఆ సినిమా విడుదల కోసం చాలా అత్రుత్రగా ఎదురు చూస్తున్నాను. చాలా సంవత్సరాలు అయింది. కోవిడ్ వల్ల బాగా లేట్ అయింది. ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రాంక్స్ చేశాం అని వచ్చిన వార్తలన్ని కేవలం రూమర్స్ మాత్రమే. సెట్స్ లో అప్పుడప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం.
రిపోర్టర్: గుజరాతీ భాష మాట్లాడేందుకు శిక్షణ తీసుకున్నారా ?
ఆలీయా: కాస్త కష్టమే. కానీ కొత్తగా ఉండాలని అనుకున్నాం. ఓ ట్రైనర్ ద్వారా గుజరాతీ భాషలో శిక్షణ తీసుకున్నాం. సినిమా బాగా వచ్చింది. కానీ ఈ మూవీపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
రిపోర్టర్: ఇప్పటివరకు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినది ఏది ?
ఆలీయా: గంగూభాయ్. గతంలో చేసినవాటికంటే ఈ పాత్ర చాలా కష్టం. కానీ ఈ పాత్రే నాకు బాగా నచ్చింది. ఇక నా కెరీర్లో ఏది బెస్ట్ రోల్ అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు.
ఆ తర్వాత ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో చకచకా సమాధానాలు చెప్పింది అలియా
Also Read: Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..