Aishwarya Rajesh: ‘అలాంటి డ్రెస్‌లో రా.. నీ బాడీ చూడాలి అన్నాడు’.. ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన ఐశ్వర్య రాజేశ్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలపై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. కొందరు దర్శకులు, నిర్మాతల చేతిలో తమకు జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ కూడా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టారు.

Aishwarya Rajesh: అలాంటి డ్రెస్‌లో రా.. నీ బాడీ చూడాలి అన్నాడు.. ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన ఐశ్వర్య రాజేశ్
Actress Aishwarya Rajesh

Updated on: Jan 30, 2026 | 6:54 PM

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అందం కన్నా అభినయానికి ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్‌ ఒకరు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోందీ అందాల తార. ఓ వైపు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తోందీ ముద్దుగుమ్మ. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఐశ్వర్య. వెంకటేశ్‌కు భార్య భాగ్యలక్ష్మి పాత్రతో అందరిమన్ననలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ్ మూవీస్ లోనూ నటిస్తోన్న ఈ అందాల తార తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సందర్భంగా గతంలో ఓ నిర్మాత చేతిలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది.

‘నేనే కాదు.. ప్రతి ఒక్క అమ్మాయి ఏదొక టైమ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటుంది. ఒక నిర్మాత నాతో.. ‘ నైట్ అమ్మాయిలు దుస్తులు వేసుకుంటారు కదా.. నువ్వు ‍‍అలాగే వేసుకుంటే ‘ఐ వాంట్ సీ యువర్ బాడీ’అని నాతో అన్నారు. అది చూసి ఇలా ఎంతమంది అమ్మాయిలని చేసుంటారని నాకు అనిపించింది. నటన గురించి కాకుండా ఇలా మాట్లాడటం నన్ను చాలా బాధించింది’ అని ఐశ్వర్య వాపోయింది. అయితే ఆ నిర్మాత ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదీ స్టార్ హీరోయిన్.

ఇవి కూడా చదవండి

వీడియ ఇదిగో..

డ్రెస్సింగ్ గురించి ఏమన్నారంటే?

కాగా ఆడవాళ్ల డ్రెస్‌ల విషయంపై స్పందించిన ఐశ్వర్య .. మనం సందర్భానికి తగినట్లుగా వేసుకోవడం మంచిదని సలహా ఇచ్చింది.
‘ మా ఇంట్లో మా బ్రదర్.. అమ్ములు ఈ డ్రెస్ బాగాలేదు అని చెబితే వెంటనే దానిని పక్కన పెట్టేస్తాను. నేను ఎప్పుడైనా ఫారెన్ వెళితే అక్కడ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు డ్రెస్సింగ్ పై నా ఒపీనియన్ చెప్పాలి అంటే.. రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అంటాను. ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే అక్కడ జనాలు ఎలా ఉంటారో తెలుసు. కాబట్టి రివీలింగ్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది కాదు’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.