Actress Aamani: అందుకే భర్తతో విడిపోయా.. సంచలన విషయాలు తెలిపిన ఆమని

హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆతర్వాత సినిమాలు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మరి అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికే పోటీపడి మరి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఆమని కూడా ఇప్పుడు వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు.

Actress Aamani: అందుకే భర్తతో విడిపోయా.. సంచలన విషయాలు తెలిపిన ఆమని
Aamani

Updated on: Jan 03, 2026 | 2:24 PM

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క్యారెక్టరర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఆ జాబితాలో సీనియర్ నటి ఆమని ఒకరు. అప్పట్లో ఆమనీకి  విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమానికి అభిమానులు ఎక్కువ.  స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ లో ఆమని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు ఆమని. ఓ వైపు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ఆమని.కాగా గతంలో ఆమని ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, కెరీర్, పిల్లల పెంపకంపై అనేక వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. పెళ్లి గురించి అడిగినప్పుడు, తమది లవ్ మ్యారేజ్ కాదని, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదని, కేవలం ఒక కనెక్ట్ అవ్వడం వల్ల జరిగిన బంధం అని తెలిపారు. ఆ సమయంలో ఆయన మంచితనం చూసి వివాహం జరిగిందని పేర్కొన్నారు. అయితే తన మాజీ భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను మళ్లీ సినిమాల్లోకి వచ్చి అప్పులు తీర్చారని మీడియాలో వచ్చిన వార్తలపై ఆమని స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమని అన్నారు. తన మాజీ భర్త సినిమా ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు తలెత్తిన కొన్ని సమస్యలు తనే పరిష్కరించుకున్నారని, అప్పులన్నింటినీ రియల్ ఎస్టేట్ ద్వారా తీర్చేశారని ఆమె తెలిపారు.

తనకు సినిమా అంటే ఉన్న ప్యాషన్ వల్లే మళ్లీ సినిమాల్లోకి వచ్చానని, బ్రేక్ తీసుకున్నది తానే అని స్పష్టం చేశారు. అప్పుడు తన భర్తకు కూడా తాను సినిమాల్లో ఉండటం ఇష్టం లేదని తెలిపారు. విడిపోవడం గురించి అడిగినప్పుడు, తమ బంధం ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా ఫ్రెండ్లీగా ముగిసిందని ఆమని పేర్కొన్నారు. తన మాజీ భర్త మంచి వ్యక్తి అని, తాను సినిమాల్లో బిజీగా ఉండగా, ఆయన తన వృత్తిపరమైన వ్యాపారంలో బిజీగా ఉన్నారని తెలిపారు. తాము ఇప్పటికీ మాట్లాడుకుంటున్నప్పటికీ, వేరుగా ఉంటున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సింగిల్ పేరెంట్‌గా పిల్లల పెంపకంపై ఆమని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని..వారు తనకు ప్రపంచమే అని చెప్పారు. తన మొదటి ప్రపంచం సినిమా అయితే, రెండవ ప్రపంచం తన పిల్లలని వివరించారు. అదేవిధంగా  హీరోయిన్‌గా స్థిరపడటానికి ఒక సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం కష్టపడ్డానని, పిల్లలు కూడా ఆలస్యంగానే వచ్చారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.