AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaavya Maran- Anirudh: కావ్య మారన్- అనిరుధ్‌ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్య మారన్‌లు పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లితో ఒక్కటవుతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

Kaavya Maran- Anirudh: కావ్య మారన్- అనిరుధ్‌ల పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్
Kaavya Maran And Anirudh
Basha Shek
|

Updated on: Jun 28, 2026 | 2:03 PM

Share

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోననున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రిలేషన్ షిప్ రూమర్లపై అటు అనిరుధ్ కానీ, ఇటు కావ్య కానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఒక సందర్భంలో కావ్య గురించి మాట్లాడిన అనిరుధ్ తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. అయినా వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఈ విషయంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన అనిరుధ్, కావ్య మారన్ ల గురించి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘అనిరుధ్ ఎంతో మృదుస్వభావి. ప్రతిభావంతుడైన యువకుడు. పైగా చాలా మంచి వ్యక్తి. సాఫ్ట్ నేచర్ కలిగినవాడు. అయితే ఏదో ఒక కారణం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందనిపిస్తోంది. త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. నేను విన్న సమాచారం బట్టి త్వరలోనే ఈ వివాహం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇద్దరూ చాలా మంచోళ్లు. అందమైన జంటగా కనిపించే వీరు మంచి దంపతులుగా కూడా పేరు తెచ్చుకుంటారు’ అని చెప్పుకొచ్చారు మహేంద్రన్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా మారన్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో ఆమె పేరు తెగ మార్మోగుతుంటుంది. ఇక అనిరుధ్ విషయానికి వస్తే సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నారు. అలాంటిది వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us