తమిళ్ స్టార్ విశాల్ (Vishal) ప్రస్తుతం లాఠీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఆదివారం ఈ సినిమా సెట్ లో మరోసారి గాయపడ్డారు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారు చిత్రయూనిట్ సభ్యులు. విశాల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరముందని.. అతనికి పూర్తిగా మెరుగైన తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. విశాల్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని.. అతని చేతికైన గాయం చిన్నదే అని.. ఫ్రాక్చర్ కాదని చెప్పారు డాక్టర్. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం బరువు తగ్గడమే కాకుండా తన ఫిట్ లుక్ పూర్తిగా మార్చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ కు ప్రమాదం జరగడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ ఈ మూవీ షూటింగ్ జరుగుతన్న సమయంలో అనేక సార్లు గాయపడ్డారు విశాల్. గతంలో హైదరాబాద్ లో స్టంట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 12న లాఠీ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
Actor @VishalKOfficial once again got injured on the sets of #Laththi .
The Night Shoot was cancelled as #Vishal got a leg injury during shoot of climax fight sequence happening at chennai. The shoot will resume once the actor recovers. pic.twitter.com/xnPAx8THHW
— Sreedhar Pillai (@sri50) July 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.