AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vennela Kishore: ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు.. వెన్నెల కిశోర్ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్లలో వెన్నెల కిశోర్ ఒకరు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తోన్న ఇతను ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాడు. అయితే గతంలో ఒకసారి వెన్నెల కిశోర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Vennela Kishore: ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు.. వెన్నెల కిశోర్ కామెంట్స్ వైరల్
Vennela Kishore
Basha Shek
|

Updated on: Sep 03, 2026 | 9:31 PM

Share

వెన్నెల కిశోర్..ప్రస్తుతం తెలుగు నాట డిమాండ్ ఉన్న ది మోస్ట్ వాంటెడ్ కమెడియన్. ప్రస్తుతం ఇతను ఏడాదికి దాదాపు 10కి పైగా సినిమాల్లో నటిస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు వెన్నెల కిశోర్ క్రేజ్, పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో. గతేడాది ఓవరాల్ గా 11కు పైగా సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ ఈ ఏడాది ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి, హే బలవంత్, రాకాస, జెట్లీ, పురుష సినిమాల్లో నటించాడు వెన్నెల కిశోర్. కేవలం కమెడియన్ గానే కాకుండా సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడీ స్టార్ కమెడియన్. జెట్లీ సినిమానే ఇందుకు మంచి ఉదాహరణ. కాగా అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించిన వెన్నెల కిశోర్ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. వెన్నెల సినిమాతో తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. కాగా మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా వెన్నెల కిశోర్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అందులో మహేష్ బాబుతో కలిసి అతను చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన వెన్నెల కిశోర్ దూకుడు సినిమా ఛాన్స్ కోసం తనకెదురైన అనుభవాన్ని అందరితో పంచుకున్నాడు.

‘దూకుడు సినిమా టైంలో దర్శకుడు శ్రీను వైట్ల.. నన్ను లైపో సర్జరీ చేయించుకోమన్నారు. పైగా ఈ సర్జరీకి ఆయనే డబ్బులు కూడా ఇస్తానని అన్నారు. ఎందుకంటే మహేశ్ బాబు పక్కన నటించాలంటే సన్నగా కనిపించారు. నువ్వు లావుగా ఉంటే బాగోదని అన్నారు. కానీ నేను నేచురల్ గానే తగ్గుతానని చెప్పా. కానీ తర్వాత తగ్గలేదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యాక ఇలానే బాగుందని శ్రీనువైట్ల చెప్పారు’ అని వెన్నెల కిశోర్ అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. కాగా మహేష్ బాబు, వెన్నెల కిశోర్ ది సూపర్ హిట్ కాంబినేషన్. దూకుడుతో పాటు ఆగడు, బ్రహ్మోత్సవం, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాల్లో వీరు కలిసి నటించారు.

ఇవి కూడా చదవండి

కకాగా ప్రభాస్, ఎన్టీఆర్ ల గురించి మాట్లాడిన వెన్నెల కిశోర్.. గతకొన్నేళ్లలో ఈ స్టార్ హీరోల రేంజ్ బాగా పెరిగిపోయిందన్నారు. వాళ్ల ఇమేజ్ మారిపోయింది. అలాంటి హీరోల సినిమాలో తనకు సరైన క్యారెక్టర్స్ రాయడం సాధ్యం కాదు కదా అని చెప్పుకొచ్చాడు. వారి సినిమాల్లో తాను ఊరికే నిలబడి చూడటం తప్పితే చేసేదేం ఉండదని పేర్కొన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us