200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ సుత్తివేలు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు సుత్తివేలు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన డైలాగ్స్, కామెడీ , పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు
Suthivelu

Updated on: Jan 20, 2026 | 7:15 AM

ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షుకులను కడుపుబ్బా నవ్వించారు సుత్తివేలు. ఆ రోజుల్లోనే తనదైన డైలాగ్స్ తో , పంచులతో నవ్వులు పూయించారు సుత్తివేలు. ఆయన సినిమాలు, సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు సుత్తివేలు. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఆయన కామెడీ ట్రాక్ సపరేట్ గా ఉంటుంది. సుత్తివేలు కామెడీ కోసమే సినిమా కు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉండేవారు. ఆయన సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సూతివేలు భార్య లక్ష్మీ రాజ్యం, ఆయన జ్ఞాపకాలను, చివరి రోజులను పంచుకున్నారు. సూతివేలు గారి అసలు పేరు కే.ఎల్.ఎన్. నరసింహారావు. చిన్నతనంలో ఆయన చాలా సన్నగా, చురుకుగా ఉండేవారని, అల్లరి ఎక్కువగా చేసేవారని లక్ష్మీ రాజ్యం తెలిపారు.  ఆయన తండ్రి అల్లరిని కంట్రోల్ చేయడానికి ఆయన్ను తాటాకు బుట్టలో కూర్చోబెట్టి వేలాడదీసేవారట. దీనితో పక్కింటివారు ఆయన్ను వేలు అని పిలవడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలోకి వచ్చాక, దర్శకుడు జంధ్యాల గారు ఆయనకు సుత్తివేలు  అనే పేరుపెట్టారని ఆమె అన్నారు. ఈ పేరుతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

సూతివేలు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారని లక్ష్మీ రాజ్యం తెలిపారు. ఉదయం స్నానం చేసి, పూజ, విష్ణు సహస్రనామం పూర్తయిన తర్వాతే ఏదైనా తినేవారట. బయట ఆహారం తినడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. షూటింగ్‌లకు వెళ్లినా కూడా ఇంటి నుంచే పచ్చళ్లు, పొడులతో సహా ఆహారాన్ని తీసుకువెళ్లేవారని లక్ష్మీ రాజ్యం తెలిపారు. శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి దిగ్గజ నటులు సైతం ఆయన పచ్చళ్లను, పొడులను ఎంతగానో ఇష్టపడేవారని, వాటి గురించి తరచుగా అడిగేవారని లక్ష్మీ రాజ్యం గుర్తుచేసుకున్నారు. సూతివేలు గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో నుంచే తమ ఆహారాన్ని చేసుకుని వెళ్ళేవారని ఆమె అన్నారు.

సూతివేలు గారు 63 ఏళ్ల వయసులో, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, 2012లో ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలో మరణించారు. ఆయన మరణించిన రోజు రాత్రి మామూలుగానే భోజనం చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, మరుసటి రోజు భీమవరంలో నాటక ప్రదర్శనల కోసం ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారని లక్ష్మీ రాజ్యం గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త ఆలస్యంగా బయటకు తెలియడంతో చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు చివరి చూపు చూసుకోలేకపోయారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తమకు బంధువని, దాసరి నారాయణరావు సూతివేలు మరణానంతరం ఆయన కుమారుడికి అండగా నిలిచారనిఅదేవిధంగా బాలకృష్ణతో సూతివేలు గారికి ప్రత్యేక అనుబంధం ఉండేదని, బాలకృష్ణ తమ పిల్లలను కూడా ఆప్యాయంగా పలకరించేవారని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..