విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో నటించిన సినిమా విక్రమ్ (Vikram). జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇందులో తమిళ్ స్టార్ హీరోస్ విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో సినిమా థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా వస్తోంది. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… చాలా కాలం తర్వాత కమల్ హాసన్ వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా.. ఫహద్ ఫాజిల్ పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టారు. ఇక ముఖ్యంగా హీరో సూర్య (Surya) ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించాడు..
ఈ సినిమాలో అందరూ స్టార్ హీరోస్ కీలకపాత్రలలో నటించడంతో మూవీపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా చివరలో సూర్య సర్ ప్రైజింగ్ ఎంట్రీగా ఉంటుంది.. సూర్య పాత్ర రావడంతో ఈ సినిమా వేరేలెవల్కు వెళ్లినందనే చెప్పుకోవాలి. ప్రత్యేకమైన పాత్రలో సూర్య చాలా పవర్ ఫుల్‍గా కనిపించి అదరగొట్టాడు.. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం కమల్ హాసన్ ఫోన్ చేయగానే వెంటనే ఒప్పుకుని విక్రమ్ సినిమాలో నటించేందుకు వచ్చేశాడట. స్పెషల్ రోల్ చేసినప్పటికీ ఎలాంట్ చార్జ్ తీసుకోలేదట. దీంతో ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.