Actor Suriya: రోలెక్స్.. నయా లుక్ అదుర్స్.. ట్రెండీ స్టైలీష్ లుక్‏లో హీరో సూర్య.. ఫోటోస్ వైరల్..

ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు భారీ బడ్జె్ట్‏తో గ్రాండ్‏గా నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరిన్ని అంచనాలను పెంచేశాయి.

Actor Suriya: రోలెక్స్.. నయా లుక్ అదుర్స్.. ట్రెండీ స్టైలీష్ లుక్‏లో హీరో సూర్య.. ఫోటోస్ వైరల్..
Suriya

Updated on: Feb 01, 2024 | 2:50 PM

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే ఉన్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు భారీ బడ్జె్ట్‏తో గ్రాండ్‏గా నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరిన్ని అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది జూన్ 16న ఈ చిత్రాల్లో పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సూర్య అభిమానులు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇన్నాళ్లు కంగువ సినిమా కోసం మాస్ అవతారంలో కనిపించిన సూర్య.. ఇప్పుడు ట్రెండీ అండ్ స్టైలీష్ లుక్‏లో కనిపించాడు. సూర్య ఫోటోను అవినాష్ గోవారికర్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ… “కంగువ సినిమా కోసం చాలా కాలం తర్వాత సూర్య… స్టైలీష్ లుక్, ఫోజు నమ్మశక్యంగా లేదు ” అంటూ రాసుకొచ్చాడు. ఆ ఫోటోలలో సూర్య బ్లాక్ కలర్ టీ షర్ట్.. హెయిర్ కలర్ తో హాలీవుడ్ రేంజ్ హీరోగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం సూర్య లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అలాగే సూర్య సైతం తన ఇన్ స్టాలో రెండు ఫోటోలను షేర్ చేశాడు. కంగువ సినిమాలో అతను ద్విపాత్రాభినయం చేయనున్నారు. మొదటిది వారియర్ లుక్.. రెండవది మోడ్రన్ లుక్. అని తెలుస్తోంది.

శివ దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా కంగువ చిత్రాన్ని ముప్పై ఎనిమిది భాషలలో మొత్తం 3Dలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో యానిమల్ మూవీ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల అతడి బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. సూర్య చివరిసారిగా విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించారు. కంగువ తర్వాత డైరెక్టర్ వెట్రిమారన్ దర్సకత్వంలో నటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.