బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3(F3). వెంకటేష్, వరుణ్ తేజ కలిసి నటిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. గతంలో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న ఎఫ్ 3 (F3 Movie) సినిమా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుందని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు మేకర్స్. అలాగే ఈ ఎఫ్ 3 సినిమా పూర్తిగా డబ్బు గురించిన నేపథ్యంలో ఉండనుందని పోస్టర్స్‌తో హింట్ ఇచ్చేసింది చిత్రయూనిట్. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సునీల్ ఎఫ్ 3 సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సునీల్ మాట్లాడుతూ..నా సినీ ప్రయాణం విలక్షణంగా సాగుతుంది. మొదట కమెడియన్ గా చేశాను. తర్వాత హీరో. నాలో వున్న హిడెన్ ట్యాలెంట్ డ్యాన్స్ ని బయటపెట్టాను. ఇంత లావు వున్న నేను సిక్స్ ప్యాక్ చేశాను. తర్వాత విలన్ గా మారాను. పుష్పలో నా వయసుకు మించిన పాత్ర చేశాను. నేను ఏది చేసినా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు అన్నారు. వారు ఆదరించడం వల్లనే నా ప్రయాణం ఇంత విలక్షణంగా సాగింది. ఇటీవలే కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా” అని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. ”తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ ‘సొంతం’ సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం” అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో వుంటుంది అని చెప్పుకొచ్చారు సునీల్.
మరిన్ని ఇక్కడ చదవండి :