Prasanna Vadanam Twitter Review: ప్రసన్న వదనం సినిమాపై పబ్లిక్ టాక్.. సుహాస్ ఖాతాలో మరో హిట్ ..?

ప్రస్తుతం సుహాస్ నటించిన లేటేస్ట్ సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రానికి అర్జున్ వైకే దర్శక్తవం వహించగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్స్ పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై క్యూరియాసిటీని కలిగించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా మే 3న అడియన్స్ ముందుకు వచ్చింది.

Prasanna Vadanam Twitter Review: ప్రసన్న వదనం సినిమాపై పబ్లిక్ టాక్.. సుహాస్ ఖాతాలో మరో హిట్ ..?
Prasanna vadanam Twitter Review

Updated on: May 03, 2024 | 7:12 AM

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సుహాస్. సహజ నటనతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుహాస్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి వరుస హిట్స్ తో భారీ వసూళ్లు రాబడుతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుహాస్ నటించిన లేటేస్ట్ సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రానికి అర్జున్ వైకే దర్శక్తవం వహించగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్స్ పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై క్యూరియాసిటీని కలిగించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా మే 3న అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ అదిరింది.. ఊహించని ట్విస్టులతో ఇంటర్వెల్ సీన్ బాగుందని.. మరోసారి తన అద్భుతమైన నటనతో సుహాస్ అదిరగొట్టేశాడని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. సుహాస్ ఖాతాలో మరో హిట్ ప్రసన్న వదనం.. వేసవిలో టాలీవుడ్ సూపర్ హిట్ ఇదే.. డైరెక్టర్ అర్జున్ డైరెక్షన్ సింప్లీ సూపర్ .. ఇక రాశీసింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ అంటూ మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

ఈ చిత్రానికి తెల్లవారుజామున నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అటు యూకేలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికి మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు సుహాస్. ఈసారి మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్క్రిప్ట్ తో సుహాస్ మెప్పించాడని.. డైరెక్టర్ అర్జున్ సరికొత్త కథ రాసుకున్నాడని అంటున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.