
టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో పోషించిన సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సుహాస్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం హే బల్వంత్ అనే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ తన కెరీర్‌లోని వివిధ దశలను, అలాగే ఎదురైన అవమానాలను వివరించారు. ఒక నటుడిగా పదేళ్లుగా సాగుతున్న తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయాలు, చేదు సంఘటనలను చెప్పుకొచ్చారు. ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాలపై ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదని, వేకువజామున 3 లేదా 4 గంటలకు మెలకువ వస్తుందని అన్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి పిల్లలతో ఆడుకోవడం లేదా కారులో తిరగడం వంటివి చేస్తుంటానని చెప్పారు. సినిమా ఫలితాన్ని ముందుగా తన స్నేహితులు, కుటుంబ సభ్యులు చూసి చెబుతారని, వారి నిజాయితీతో కూడిన అభిప్రాయం తనకెంతో ముఖ్యమని సుహాస్ పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
తాను సాధారణంగా ఇంట్రావర్ట్‌నని ప్రచారంలో ఉన్నప్పటికీ, కెమెరా ముందు మాత్రమే అలా ఉంటానని, బయట మాత్రం చాలా ఎక్స్‌ట్రావర్ట్‌నని సుహాస్ స్పష్టం చేశారు. లైట్ల ముందు తెలియకుండానే అలెర్ట్ అవుతానని వివరించారు. తాను తన స్నేహితుల సర్కిల్‌కు అలవాటు పడిపోయానని, పార్టీల వంటి వాటికి దూరంగా ఉంటానని తెలిపారు. సినిమా అవకాశాల కోసం పడిన కష్టాలు, కడుపు నిండక కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు, యూట్యూబ్ నుండి హీరోగా మారి, ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి జాతీయ అవార్డు గెలుచుకోవడం వంటి అంశాలను పేర్కొన్నారు. విజయవాడ నుండి సినీ రంగంలో అడుగుపెట్టి, తన మొదటి సినిమా ప్రీమియర్ తిరిగి విజయవాడలోనే పడటం అద్భుతమని ఆ పోస్ట్‌లో రాశారు. ఈ పదేళ్ల ప్రయాణం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని సుహాస్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
అయితే, ఈ ప్రయాణంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని కూడా సుహాస్ పంచుకున్నారు. మజిలీ హిట్ అయిన తర్వాత, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఉప్పు కర్పూరం అనే సినిమాలో ఆమె స్నేహితుడి పాత్రకు తనకు అవకాశం వచ్చిందని తెలిపారు. సెట్‌లో ఒక వ్యక్తి “కీర్తి సురేష్‌తో నువ్వు ఇంత క్లోజ్‌గా ఉంటావా?” అని వ్యంగ్యంగా అడిగారని, ఆ మాట తనను తీవ్రంగా బాధించిందని సుహాస్ చెప్పారు. ఆ రోజు షూటింగ్ వదిలేసి, తన స్నేహితుడు సందీప్ దగ్గరికి వెళ్లి ఏడ్చేశానని, సినిమాలను వదిలేసి విజయవాడకు తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఆ సంఘటన తనలో కసిని పెంచిందని తెలిపారు. ఈ విషయం కీర్తి సురేష్‌కు ఇప్పటివరకు తెలియదని, ఆమె చాలా మంచి, దయగల వ్యక్తి అని, ఆమె నటనకు ఎంత పెద్ద అభిమానినో, ఆమె నిజమైన వ్యక్తిత్వానికి కూడా అంతే అభిమానినని సుహాస్ అన్నారు. ఇలాంటి అనుభవాలే నటుడిగా తనను ముందుకు నడిపాయని, ఎలాంటి నేపథ్యం లేని వారు కూడా హీరోలు కావచ్చని తన ప్రయాణం ద్వారా చెప్పదలచుకున్నానని సుహాస్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..