Nandhu : 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. ఆ విషయంలో నా భార్యకు ప్రామిస్ చేశాను.. నందు కామెంట్స్..

ఇప్పుడిప్పుడే సినీరంగంలో గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోలలో అతడు ఒకరు. తాను 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. కానీ తనకు డబ్బు కంటే ఎక్కువగా గౌరవమే ముఖ్యమని అంటున్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?

Nandhu : 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. ఆ విషయంలో నా భార్యకు ప్రామిస్ చేశాను.. నందు కామెంట్స్..
Nandhu

Updated on: Jan 01, 2026 | 6:11 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు హీరో నందు. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యామినీ భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. న్యూయర్ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రానా స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో నందు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నానని.. తనకు డబ్బు కంటే గౌరవమే ముఖ్యమని అన్నారు. తన జడ్జ్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి నిర్మాతగా మారానని చెప్పుకొచ్చారు.

అలాగే తాను నటించిన అగ్లీ స్టోరీ అనే సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుందని తెలిపారు. తన డ్రింకింగ్ కెరియర్ గురించి చెప్పుకొచ్చారు. తన కజిన్స్ ద్వారా మందు అలవాటైందని.. బయట ఫ్రెండ్స్ ఎవరూ లేరని అన్నారు. తాను మునుగుతున్నా కాబట్టి.. తనతోపాటు తన వాళ్లను సైతం ముంచేస్తున్నానని అన్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు.. అలాగే తన డ్రింకింగ్ కెరియర్ కూడా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిందని అన్నారు. బయట ఎక్కడ పడితే అక్కడ తాగనని.. తాగి డ్రైవ్ చేయనని తన భార్య గీత మాధురికి ప్రామిస్ చేశానని అన్నారు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటానని.. వోడ్కా తాగుతుటే వీళ్లు పిల్లనాకోడుకుల్రా అంటున్నారని.అందుకే విస్కీ తాగమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నందు నటించిన సైక్ సిద్ధార్థ్ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దాదాపు 18 సంవత్సరాలుగా సినీరంగంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నందు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..