అసలైన అప్డేట్ ఇదే..! ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..

సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడే కాకుండా.. విశాల హృదయుడు కూడా. ఆపద అన్న పదం వినిపిస్తే చాలు.. దేవుడిలా వెంటనే కరుణిస్తాడు. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకుంటాడు. తాజాగా సోనూ సూద్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అసలైన అప్డేట్ ఇదే..! ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..
Sonu Sood

Updated on: Sep 19, 2026 | 10:35 AM

ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో,ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లకు ఇండియాలో అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ కొత్త మోడళ్ల సేల్స్ ప్రారంభం కావడంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని ఆపిల్ స్టోర్ల వద్ద ఐఫోన్ ప్రియులు భారీగా క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో స్టోర్లు తెరవకముందే చాలామంది కస్టమర్లు చేరుకుని తమకు నచ్చిన కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకునేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున నుంచే క్యూలు కనిపించాయి. ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ఆపిల్ పలు కీలక అప్‌గ్రేడ్స్‌ను తీసుకొచ్చింది. A20 ప్రో చిప్, 48ఎంపీ Fusion మెయిన్ కెమెరా, వేరియబుల్ అపెర్చర్, 18ఎంపీ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఈ సిరీస్‌లో ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రో ధర ఇండియాలో రూ. 1,64,900 నుంచి ప్రారంభమవుతుండగా, స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి ధర మరింత పెరుగుతుంది.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

కొత్త ఐఫోన్ కోసం ఆపిల్ స్టోర్ల ముందు భారీగా చేరిన జనాన్ని చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. స్టోర్ ముందు క్యూలో నిలబడి ఉన్న కస్టమర్ల ఫొటోను షేర్ చేస్తూ.. కేవలం ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం కంటే సమాజాన్ని కూడా మెరుగుపరిచే దిశగా ప్రజలు ఇలాంటి ఉత్సాహాన్ని చూపిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సోనూ సూద్ తన పోస్టులో “కొత్త ఫోన్, కొత్త EMI… కానీ పాత బిల్లులే! మన ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా మనం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. నిజమైన అప్‌గ్రేడ్ అంటే… మెరుగైన సమాజం కోసం అడుగు వేయడం!” అంటూ రాసుకొచ్చారు సోనూ సూద్.

ఇవి కూడా చదవండి

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

సోనూ సూద్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు ఆయన చెప్పిన విషయంతో ఏకీభవిస్తూ స్పందించారు. టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా సమాజం కోసం కూడా ప్రజలు తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పడం ఆలోచించాల్సిన విషయమని పలువురు కామెంట్లు చేశారు. అయితే మరోవైపు కొంతమంది నెటిజన్లు సోనూ సూద్ వ్యాఖ్యలను ప్రశ్నించారు. తమ సంపాదనతో ఒక ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడం వ్యక్తిగత నిర్ణయమని, దానిని సామాజిక సేవతో పోల్చాల్సిన అవసరం లేదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us