నటుడు సోనూ సూద్ (Sonu Sood)..పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్.. బాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్‌గానే ప్రేక్షకులకు తెలిసిన సోనూసూద్.. కరోనా సంక్షోభం.. లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా మారాడు.. వలస కార్మికులకు.. నిరుపేదలకు.. పేద ప్రజలకు సాయం చేసి వారి పాలిట దేవుడిగా మారాడు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సోనూసూద్‌ను దేవుడిగా ఆరాధించారు. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. సోనూసూద్ పై అభిమానంతో చాలా మంది తమ వ్యాపార సంస్థలకు.. తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుని అభిమానాన్ని వ్యక్తపరిచారు. తాజాగా సోనూ సూద్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.
రియల్ హీరో సోనూసూద్‌కు దుబాయ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందించింది. నిరుపేదలకు సాయం చేస్తున్న సోనూసూద్‌కు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందచేసింది. సమాజ సేవకు అహర్నిశలు శ్రమిస్తున్న రియల్ హీరోను ప్రతిష్టాత్మక గౌరవం అందించి సన్మానించింది. ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, ఏదైనా రంగంలో నిపుణులకు మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తనకు గోల్డెన్ వీసా అందించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాడు సోనూ సూద్. “నాకు గోల్డెన్ వీసా అందించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. నేను సందర్శించడానికి ఇష్టపడే ప్రదేశాలలో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చెందడానికి ఒక డైనమిక్ ప్రదేశం. నేను అధికారులకు తెలుపుతున్నాను. ” అంటూ తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం సోనూ సూద్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న ఆచార్య సినిమాలో కీలకపాత్రలో నటించారు.
Also Read: Bloody Mary: బ్లడీ మేరీ మేకింగ్ వీడియో రిలీజ్.. అంధురాలిగా నివేదా పేతురాజ్..
Manchu Vishnu: సన్నీ లియోన్‌ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..
Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..