AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్ని ఏళ్లు అవుతున్నా, అంత పెద్ద స్టార్ అయినా.. అతను ఏ మాత్రం మారలేదు.. అదే వినయం, అదే మర్యాద

ప్రముఖ నటుడు శివకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించి అలరించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన శివకృష్ణ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు .

ఇన్ని ఏళ్లు అవుతున్నా, అంత పెద్ద స్టార్ అయినా.. అతను ఏ మాత్రం మారలేదు.. అదే వినయం, అదే మర్యాద
Shiva Krishna
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 10:00 AM

Share

ప్రముఖ నటుడు శివకృష్ణ.. ఒకప్పుడు తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పించారు. ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ సమయంలో ఆయనతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రభాస్ లాంచింగ్ చిత్రానికి ఆయన తండ్రి పాత్రలో నటించడం వెనుక ఉన్న కథను వివరించారు. ఈ పాత్ర కోసం స్వయంగా అశోక్ కుమార్ (ప్రొడ్యూసర్) తనను ఎంపిక చేశారని, కృష్ణంరాజు గారు కూడా చేయగలిగి ఉన్నా, తనకే అవకాశం దక్కిందని తెలిపారు. ప్రభాస్ అప్పట్లో ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే నిగర్వంగా ఉంటారని శివకృష్ణ ప్రశంసించారు. “ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి” అనే సామెతకు ప్రభాస్ ప్రతీక అని ఆయన అన్నారు. 15 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిసినప్పుడు కూడా ప్రభాస్ తనను పలకరించిన తీరు ఆయన వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభాస్ అందరినీ గౌరవించే విధానం, ముఖ్యంగా భోజన సమయాల్లో చూపించే మర్యాద కృష్ణంరాజు గారిని మించి ఉంటుందని ఇతరులు చెప్పగా విన్నానని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

తన వ్యక్తిత్వం, విలువలు తన తండ్రి నుండే అలవడ్డాయని శివకృష్ణ తెలిపారు. ఆయన తండ్రి షామీర్‌పేటలోని బొమ్మరాజుపేట గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. 4.5 కిలోమీటర్ల పొడవైన రోడ్డును తన సొంత ఖర్చులతో వేయించారని, దీని వల్ల నేడు 20 గ్రామాలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు రాకపోయినా, తన తండ్రి చొరవతో గ్రామస్తులందరూ తమ భూములను ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సు సేవలను రాత్రిపూట కూడా అందుబాటులోకి తెచ్చారని, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయించారని గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

సనాతన ధర్మాన్ని గురించి ప్రస్తావిస్తూ, హిందూ మతం అనేది లేదని, అది సనాతన ధర్మమే అని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మం తల్లిదండ్రులు, గురువులను దైవంగా పూజించడం, ప్రకృతిని ఆరాధించడం, పశుపక్షాదులను పోషించడం, “సర్వేజనా సుఖినోభవంతు” అనే భావనను బోధిస్తుందని వివరించారు. ఇతర మతాలను గౌరవించాలనే వైఖరి భారత్‌ను 800 సంవత్సరాల బానిసత్వానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ భారత్ 15 దేశాలతో కూడుకున్నదని, బ్రిటిష్ పాలకులు 45 ట్రిలియన్ డాలర్ల (సుమారు 45 లక్షల కోట్ల రూపాయలు) సంపదను దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. దేశ సరిహద్దుల గురించి రాజకీయ నాయకులకు కూడా తెలియదని ఆయన విమర్శించారు. మనకెందుకులే అనే వైఖరి, పక్కింట్లో జరిగే అన్యాయాన్ని పట్టించుకోకపోవడం హిందువుల పెద్ద లోపమని, దీని వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని శివకృష్ణ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us