AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Dev: ఏం చెప్పాడు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సత్యదేవ్ మాటలు..

టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం స్వయంకృషితో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే ఆయన.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన కెరీర్ లోని ఒడిదొడుకులు, తను అనుభవించిన కష్టాలు, నిరాశలను ఎలా ఎదుర్కొన్నారో చెప్తూ యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే విషయాలను పంచుకున్నారు.

Satya Dev: ఏం చెప్పాడు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సత్యదేవ్ మాటలు..
Satyadev
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2026 | 2:15 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జ్యోతిలక్ష్మి సినిమాతో నటుడిగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ వంటి చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు.కేవలం హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్స్ తోనూ మెప్పించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ పాస్ట్ కాస్టులో పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, అవమానాల గురించి చెప్పుకొచ్చారు. జీవితంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా కుంగిపోకూడదని సత్యదేవ్ తన సినిమా ఫలితాల ద్వారా వివరించారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా డిసెంబర్ 27 వరకు తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని, ఆ ఫ్రైడే నాదే అని ఫిక్స్ అయ్యానని, కానీ డిసెంబర్ 28 నాటికి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘కృష్ణమ్మ’ చిత్రాల విషయంలో కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నా.. అనుకున్న ఫలితాలు రాలేదని, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన మరుసటి వారమే ఓటీటీలోకి వచ్చేసిన పరిస్థితులు చూశానని ఆవేదన పంచుకున్నారు. సినిమాల్లోకి రావడానికి తను పడిన కడుపు కోత గురించి సత్యదేవ్ మాట్లాడుతూ—“నేను చాలా డెస్పరేట్ అయిపోయాను. భయమేసింది. కడుపు కాలితే ఏదైనా చేస్తాం గురువు. నేను ఒక ప్లాన్ వేసుకున్నాను.. నా కలని (Dream), నా ఉద్యోగాన్ని రెండింటినీ వదల్లేదు. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు సినిమా షూటింగ్స్ లో పాల్గొనేవాడిని. మళ్ళీ ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 3 గంటల వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడిని. అలా కేవలం రెండు నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గాను” అని తన కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. కలను నిజం చేసుకోవడానికి కష్టపడాలే తప్ప దేన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదని ఆయన నిరూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

జీవితంలో ఏమీ లేనప్పుడు మనల్ని నమ్మిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని సత్యదేవ్ అన్నారు. “గొప్ప గొప్ప విషయాలు జరిగిపోయాక ప్రతి ఒక్కడూ గుర్తిస్తాడు.. కానీ, ఏమీ జరగకముందు మనల్ని గుర్తించేవాడే అసలైన వ్యక్తి. నన్ను నమ్మి వీడు ఏదో ఒకటి సాధిస్తాడు అని నా స్ట్రగులింగ్ డేస్ లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవుడు నిన్ను రాజు చేయాలనుకుంటే కీరిటం ఇవ్వడు.. ముందు యుద్దాన్ని ఇస్తాడు. కీరిటం యుద్ధం గెలిచాక వస్తుంది. ముందు యుద్ధం చేయాలి. లైఫ్ కూడా అంతే. నీకు ఒకటి కావలి అనుకుంటే దేవుడు ముందు అది ఇవ్వడు.. దాని చుట్టూ ఉన్నా యుద్ధాలను ఇస్తాడు. ముందు వాటిని గెలిచి చూపించాలి” అని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, కలల వైపు నిరంతరం పరుగెత్తాలనే సత్యదేవ్ స్పీచ్ యువతలో సరికొత్త జోష్ నింపుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us