సీనియర్ నటుడు శరత్ బాబు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వృద్దాప్యం కారణంగా గత కొన్నాళ్లుగా శరత్ బాబు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం సరిగాలేకుంటే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. శరత్ బాబు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితులు ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలు చేసి మెప్పించారు శరత్ బాబు. తెలుగుతో పాటు తమిళం.. కన్నడం, మలయాళ భాషల్లో ఎన్నో నటించి మెప్పించారు శరత్ బాబు.
శరత్ బాబు అస్వస్ధతకు గురవ్వడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
ఆసుపత్రికి తీసుకు వచ్చిన సమయంలో శరత్ బాబు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని.. అందువల్లే ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించామన్నారు వైదులు.జనరల్ స్పెషల్ రూమ్ కు తరలించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు . రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కనిపించరు శరత్ బాబు.