Sarath Babu: అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం.. బాడీలో మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌

ఆయన వయసు 72 ఏళ చిత్రపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

Sarath Babu: అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం.. బాడీలో మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌
Sarath Babu

Updated on: Apr 23, 2023 | 2:30 PM

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్న నటుడు శరత్‌బాబు. ఆయన వయసు 72 ఏళ చిత్రపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. చెన్నైలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా వైద్యుల సూచనతో ఆయన్ను బెంగళూరుకు తరలించారు. ఇప్పుడు హైదరాబాద్‌ AIGకి మార్చారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు.

శరత్‌బాబు 250కిపైగా సినిమాల్లో నటించారు. చివరిగా వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు. ఓ పక్క మూవీస్‌లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారు. అనేక తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ సీనియర్‌ నటుడు అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది.

ప్రస్తుతం శరత్‌బాబుకు ICUలో చికిత్స చేస్తున్నారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన వయసు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ దృష్ట్యిలో పెట్టుకుని అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు.