Macherla Niyojikavargam: రాజప్పగా సముద్రఖని.. మాచర్ల నియోజకవర్గం నుంచి లుక్ అదిరిపోయిందిగా..

సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ఊహించని లెవల్లో ఉందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నారు. ఓల్డెజ్ లుక్ లో నెరిసిన జుట్టు,

Macherla Niyojikavargam: రాజప్పగా సముద్రఖని.. మాచర్ల నియోజకవర్గం నుంచి లుక్ అదిరిపోయిందిగా..
Samuthirakani

Updated on: Jul 14, 2022 | 12:13 PM

యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం నటిస్తోన్న సినిమా మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల విడుదలైన రా.. రా..రెడ్డి సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. ఇందులో అంజలి నితిన్‏తో మాస్ స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విలక్షణ నటుడు సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన రాజప్ప పాత్రలో కనిపించనున్నట్లు లేటేస్ట్ గా విడుదలైన పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్.

సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ఊహించని లెవల్లో ఉందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నారు. ఓల్డెజ్ లుక్ లో నెరిసిన జుట్టు, మీసంతో తెల్లటి కండువతో రాజప్పగా చాలా పవర్‏ఫుల్‏గా కనిపిస్తున్నారు సముద్రఖని. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఇందులో నితిన్ జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.