Rao Ramesh: మంచి మనసు చాటుకున్న రావు రమేష్.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు

సినిమా తారలు తమ నటనతోనే కాదు ఆపద సమయాల్లోను మేమున్నామంటూ ముందుకు వస్తుంటారు. పలు సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ప్రజలమనసులు గెలుచుకుంటున్నారు.

Rao Ramesh: మంచి మనసు చాటుకున్న రావు రమేష్.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు
Rao Ramesh

Updated on: Sep 16, 2022 | 4:55 PM

సినిమా తారలు తమ నటనతోనే కాదు ఆపద సమయాల్లోను మేమున్నామంటూ ముందుకు వస్తుంటారు. పలు సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ప్రజలమనసులు గెలుచుకుంటున్నారు. ఇప్పటికే సోనూ సూద్‌లాంటి వాళ్ళు సేవాకార్యక్రమాలతో రియల్ హీరోలుగా ప్రజల మన్నలు అందుకుంటున్నారు. తాజాగా నటుడు రావు రమేష్ మంచి మనసు చాటుకున్నారు. తనదగ్గర పని చేస్తున్న వ్యక్తి మరణించడం తో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రావు రమేష్ పర్సనల్ మేకప్ మెన్ బాబు మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మేకప్ మెన్ మృతి విషయం తెలుసుకున్న రావు రమేష్ విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి.. 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. రావు రమేష్ స్వయంగా బాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్ ను అందించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రావు రమేష్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నప్పటికీ రవి రమేష్ ది మనసు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రావు రమేష్ బిజీ ఆర్టిస్ట్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు రావు రమేష్..

ఇవి కూడా చదవండి

Rao Ramesh

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..