Mahesh Babu: బాబాయ్ పాటకు డాన్స్ అదరగొట్టిన భారతి ఘట్టమనేని.. కుర్తీ మడతపెట్టి అంటూ దుమ్మురేపిన రమేష్ బాబు కూతురు..

ఇక ఇందులోని "కుర్చి మడతపెట్టి" సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో సెన్సెషన్ అవుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు డాటర్ సితార సైతం ఈ మాస్ బీట్‏కు ఇరగదీసింది. తండ్రి పాటకు డాటర్ మాస్ డాన్స్ అదిరిపోయిందంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఇప్పుడు బాబాయ్ పాటకు దుమ్మురేపింది భారతి ఘట్టమనేని..

Mahesh Babu: బాబాయ్ పాటకు డాన్స్ అదరగొట్టిన భారతి ఘట్టమనేని.. కుర్తీ మడతపెట్టి అంటూ దుమ్మురేపిన రమేష్ బాబు కూతురు..
Bharathi Ghattamaneni

Updated on: Feb 19, 2024 | 4:04 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు అందుకున్న రీజనల్ సినిమాగా ఈ మూవీ రికార్డ్ సృష్టించింది. ఇందులో శ్రీలీల, మీనాక్షి కథానాయికలుగా నటించారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. థమన్ అందించిన మాస్ మ్యూజిక్ శ్రోతలకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఇందులోని “కుర్చి మడతపెట్టి” సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో సెన్సెషన్ అవుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు డాటర్ సితార సైతం ఈ మాస్ బీట్‏కు ఇరగదీసింది. తండ్రి పాటకు డాటర్ మాస్ డాన్స్ అదిరిపోయిందంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఇప్పుడు బాబాయ్ పాటకు దుమ్మురేపింది భారతి ఘట్టమనేని..

మహేష్ బాబు అన్నయ్య.. దివంగత నటుడు రమేష్ బాబు కూతురే భారతి ఘట్టమనేని. సోషల్ మీడియాలో చాలా సైలెంట్. అప్పుడప్పుడు సితార, నమ్రతలతో కలిసి కనిపిస్తుంటుంది. మహేష్ ఫ్యామిలికీ భారతి చాలా క్లోజ్. గతంలో తన అక్కతో కలిసి ఉన్న ఫోటోస్, వీడియోస్ చాలా షేర్ చేసింది సితార. ఇక వీరిద్దరు కలిసి చేసిన డాన్స్, పార్టీస్ వీడియోస్ అభిమానులతో పంచుకుంది సితార. ఇక ఇప్పుడు మాత్రం భారతి మొదటి సారి తన డాన్స్ వీడియోను షేర్ చేసింది.

ఇన్నాళ్లు సైలెంట్‏గా కనిపించిన భారతి..ఇప్పుడు కుర్చి మడతపెట్టి పాటకు మాస్ ఎనర్జిటిక్ స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదేం స్పీట్.. ఇదేం గ్రేస్ అంటూ షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇక తన అక్కయ్య వేసిన స్టెప్పులకు సితార సైతం అవాక్కైంది. వావ్ గార్జియస్ ఉమెన్ అంటూ తెగ సంబరపడిపోయింది సితార. ప్రస్తుతం భారతి ఘట్టమనేని డాన్స్ వీడియో నెట్టింట వైరలవుతుంది. మహేష్ అన్నయ్య ఒకప్పుడు హీరోగా వెండితెరపై అలరించాడు. అప్పట్లో తన అన్నయ్య రమేష్ బాబు హీరోగా కనిపించిన సినిమాల్లో మహేష్ బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలను నిర్మించారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. 2022లో కన్నుమూశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.