
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెన్నై మహానగర పాలకసంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారీ సీనియర్ హీరో. ఆమె నిజాయతీని మెచ్చుకోవడంతో పాటు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. పద్మ చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు 45 తులాల బంగారం దొరికింది. ప్రస్తుతమన్న మార్కెట్ లో గోల్డ్ రేట్స్ చూసి వేరొకరైతే ఆ బంగారాన్ని తమ వద్దే ఉంచుకునేవారు. కానీ నిజాయతీ గల పద్మ ఆ పని చేయలేదు. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్మ నిజాయతీని మెచ్చుకుంటూ అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా రజనీకాంత్ కూడా పద్మను ఇంటికి పిలిపించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఘనంగా సన్మానం చేసి ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా అందించారు. సూపర్ స్టార్ స్వయంగా తనను ఇంటికి పిలిపించి సన్మానించడంతో పద్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పద్మతో పాటు ఆమెను ఘనంగా సత్కరించిన రజనీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా పద్మ నిజాయతీకి ప్రతీకగా ఆమెకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని అందించింది.
⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐
Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨
Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్డేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ తో బిజీ బిజీగా ఉంటున్నారు తలైవా. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.