ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? నవ్వులు పండించంలో రారాజుగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. హీరోగా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన వ్యక్తి. తెలుగువాళ్ల మదిలో ఆయనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తన కామెడీ పంచ్‌లతో నవ్వించగలరు. తన మార్క్ ఎమోషన్‌తో ఏడిపించగలరు. ఏంటి ఇంత చెప్పినా కనిపెట్టలేకపోయారా ఆయన మన నటకిరిటి రాజేంద్ర ప్రసాద్. తాజాగా ఆయన నటించిన కొత్త సినిమా కృష్ణరామ డబ్బింగ్ ప్రారంభం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహజంగా ఆయన విగ్ లేకుండా బయట కనిపించరు. తాజాగా విగ్ ధరించకుండా కనిపించడంతో.. చాలామంది ఆయన్ను గుర్తించలేకపోతున్నారు.
ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అనంతరం.. మద్రాస్ వెళ్లి సినిమాల్లో వేషాల కోసం ట్రై చేశారు రాజేంద్ర ప్రసాద్. తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. 1977లో స్నేహం సినిమాలో దర్శకుడు బాపు రాజేంద్రప్రసాద్‌కు మంచి పాత్ర ఇచ్చారు. వంశీ డైరెక్షన్‌లో వచ్చిన మంచుపల్లకి మూవీలో నటనకు ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్.. పూర్తిగా కామెడీ తరహా సినిమాల వైపు మళ్లారు. ప్రధానంగా జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన ‘రెండురెళ్ల ఆరు’, ‘అహనా పెళ్లంట’ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. వంశీ లేడిస్ టైలర్, ఎస్వీ కృష్ణా రెడ్డి డైరక్షన్‌లో వచ్చిన మాయలోడు రాజేంద్రప్రసాద్‌ను అగ్ర హీరోని చేశాయి. ఈవీవీ తీసిన అప్పుల అప్పారావు సినిమాలో నటకిరీటీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ఎర్రమందారం (1991), ఆ నలుగురు (2004) చిత్రాలను ఉత్తమ నటుడిగా ఆయన నంది పురస్కారం దక్కించుకున్నారు.
రాజేంద్రప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన నిండు నిరేళ్లు ఆయిరారోగ్యాలతో వర్ధిల్లి ప్రేక్షకులను మరింత అలరించాలని కోరుకుందాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.