
సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవ లారెన్స్. ముఖ్యంగా ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ‘కాంచన 4’తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌కు చెందిన ‘బెంజ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్ కుటుంబం నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ వారసురాలు, ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సాధారణంగా స్టార్ వారసులు అనగానే నటన వైపు మొగ్గు చూపుతారు. కానీ రాఘవి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సు పూర్తి చేస్తున్నారు. ఆమెకు సినిమాలోని వివిధ విభాగాలపై మంచి అవగాహన ఉంది. తండ్రిలాగే లారెన్స్ కూడా రాఘవేంద్రస్వామి భక్తుడు కావడంతో తన కుమార్తెకు ‘రాఘవి’ అని పేరు పెట్టారు. అయితే ఆమె ఇప్పటివరకు మీడియా ముందుకు పెద్దగా రాకపోవడంతో, లారెన్స్‌కు ఇంత పెద్ద కుమార్తె ఉందనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రాఘవి ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిందని, ఫైనల్ డ్రాఫ్ట్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. అమెరికా నుండి చెన్నై తిరిగి వచ్చిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆమె స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మరి తండ్రిలాగే ఈమె కూడా హారర్ జానర్‌ను ఎంచుకుంటుందా? లేక సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక మహిళా దర్శకురాలిగా రాఘవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..