
తమిళనాడులో గత 20 సంవత్సరాలకు పైగా మద్యం షాపులు ప్రభుత్వం అధీనంలోనే నడుస్తున్నాయి.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మద్యం దుకాణాలను నడుపుతోంది. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో అమ్మకాలు లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ అధికారులు మద్యం షాపులను ఏర్పాటు చేశారు. చాలాచోట్ల ఆలయాలు పాఠశాలలకు అత్యంత సమీపంలోని వైన్ షాపులు ఉండడంతో చాలా రోజుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
అయినా సరే వీటిపైనా చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వైన్ షాపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు విద్యాసంస్థల పక్కనే ఉన్న వైన్ షాపులను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుమారు 700 వైన్ షాపులు మూతపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల మద్యపాన ప్రియులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా వైన్ షాపులను మోసవేయడంపై ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు..
తాజాగా సీఎం విజయ్ ని కలిసిన సీనియర్ నటుడు పార్థిపన్ ఓ సలహా ఇచ్చారు.. తీసేసిన వైన్ షాపులను మళ్లీ ఏర్పాటు చేయండి. అవి జనసంచారం ఉన్నచోట కాకుండా స్మశానాలను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మధ్య దుకాణాలను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చినట్లు సీఎంను కలిసిన అనంతరం మీడియాకు చెప్పారు. మద్యం సేవించడం వల్ల ప్రాణాలకు ప్రమాదమని ఎన్ని ప్రకటనలు ఇచ్చిన ఉపయోగం లేదని.. స్మశానాల పక్కనే వైన్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల చివరకు స్మశానాలకు రావాల్సి ఉంటుంది.. అది కూడా నిత్యం మద్యం సేవించడం వల్ల త్వరగానే ఇక్కడికి రావాల్సి ఉంటుందన్న భయం కలిగి మద్యం మానే అవకాశం ఉంటుందని సరదాగా సీఎంతో చెప్పినట్టు పార్థిపన్ చెప్పారు.. ఈ మాటకు సీఎం విజయ్ కూడా నవ్వుకున్నారని అన్నారు.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాలను అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి