
సినిమాలు అన్నా… సినిమా యాక్టర్స్ అన్నా.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎవరైనా హీరో లేదా హీరోయిన్ నచ్చితే.. వారిని విపరీతంగా ఆరాధిస్తారు తెలుగు జనాలు. ఇక వారి సినిమాల రిలీజ్ రోజు పిచ్చెక్కిపోతారు. సెలబ్రేషన్స్ మాములుగా ఉండవ్. అయితే ఇప్పుడు ఆ వ్వవహారం సోషల్ మీడియాకు షిఫ్ట్ అయింది. నెట్టింట సెలబ్రిటీల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తమకు ఇష్టమైన ఫిల్మ్ అప్‌డేట్స్ షేర్ చేయడంతో పాటు.. వారి చిన్ననాటి అరుదైన ఫోటోలను కూడా వైలర్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఫోటోనే తెచ్చాం. ఈ ఫోటోలో ఉన్న బాబు ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో..? అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. విభిన్న కథలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతాడు.. ఏమైనా ఐడియా వచ్చిందా.. ? అయితే ఫైన్.. లేదంటే మీకు ఓ క్లూ ఇస్తాం. ఈ హీరో తండ్రి నిర్మాతగా రాణిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల పంపిణీదారుడు. ఇప్పటికే చాలామందికి ఐడియా వచ్చేసి ఉంటుంది.
ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి హీరో నితిన్. ప్రముఖ తెలుగు హీరో నితిన్ ఫిల్మ్ సుధాకర్ రెడ్డి. లక్ష్మీ రెడ్డిల ఏకైక కుమారుడు. హైదరాబాదులో విద్యాభ్యాసం ముగించుకుని, 19 ఏళ్ల వయసులో ‘జయం’తో నటుడిగా అరంగేట్రం చేసి, టాలీవుడ్‌లో మంచి హీరోగా ఎదిగాడు. దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే. అ..ఆ వంటి సినిమాలు నితిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నితిన్ ప్రజంట్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. అలానే వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కుతుంది. 2020లో షాలిని కందుకూరిని పెళ్లాడాడు నితిన్. ఈ నెల 30న నితిన్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే నితిన్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.