Naresh : పవిత్రకు ప్రపోజ్ చేశా.. ఆమె చెప్పింది విని రాత్రంతా నిద్రపట్టలేదు.. నటుడు నరేష్..

నరేష్, పవిత్ర లోకేష్ దంపతులు ఇటీవల "మళ్ళీ పెళ్లి" సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వారి వ్యక్తిగత జీవితంపై సాగిన అనేక చర్చలు, వివాదాల నడుమ వారు తమ ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగించిన తీరును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమ సంబంధంపై వస్తున్న కామెంట్లు, బ్రేకింగ్ న్యూస్‌లపై స్పందిస్తూ, తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నరేష్ స్పష్టం చేశారు. వారి జీవితాలు, నిర్ణయాలు వారి సొంతమని, సమాజం వారి గురించి ఏమనుకున్నా తమకు అనవసరమని పేర్కొన్నారు.

Naresh : పవిత్రకు ప్రపోజ్ చేశా.. ఆమె చెప్పింది విని రాత్రంతా నిద్రపట్టలేదు.. నటుడు నరేష్..
Naresh, Pavitra Lokesh

Updated on: Feb 24, 2026 | 3:51 PM

టాలీవుడ్ నటీనటులు నరేష్, పవిత్ర లోకేష్, వారి వ్యక్తిగత జీవితాలపై గత కొన్నేళ్లుగా సాగుతున్న తీవ్ర వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచారు. ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల “మళ్ళీ పెళ్లి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వీరిద్దరు తమ ప్రయాణం, సామాజిక విమర్శల పట్ల వారి వైఖరి,వారి బంధంలోని లోతైన అంశాలను పంచుకున్నారు. ఇన్ని వివాదాల మధ్య ఒకరికొకరు దగ్గరవడం, జీవితాన్ని పంచుకోవడం ఎలా సాధ్యమైందని అడిగినప్పుడు, నరేష్ స్పందిస్తూ, “ఇద్దరు కలిసి ఉండాలంటే, పెళ్లి ముందు కాకపోయినా, తరువాత అయినా చెడగొట్టడానికి చాలామంది ఉంటారు. బతకాల్సింది ఇద్దరు. మా పాస్ట్ లు మీకు తెలుసు. మా మనస్సాక్షులు మాకు తెలుసు” అని అన్నారు. తమది ఒక ఇంటింటి రామాయణంగా అభివర్ణించిన ఆయన, చాలామంది తమ జీవితాన్ని లోపలే పడి బాధపడుతున్నారని, కానీ తాము అలా కాకుండా, దేవుడు ఇచ్చిన ఒక్క జీవితాన్ని నిజాయితీగా సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కృష్ణ, విజయనిర్మల వంటి పెద్దల రక్తం తనలో ఉందని గుర్తు చేస్తూ, జీవితంలో మిగిలిన ఈ కొద్ది కాలాన్ని ఒక అద్భుతమైన తోడుతో ఆనందంగా గడపడానికి సమాజానికి భయపడాల్సిన అవసరం లేదని నరేష్ గట్టిగా చెప్పారు. “మా కుటుంబం, మా శ్రేయోభిలాషులు, మమ్మల్ని ప్రేమించేవాళ్లకు మాత్రమే మేము సమాధానం చెప్పాలి. ఉచితంగా కామెంట్లు పెట్టేవారికి కాదు” అని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

వారి ప్రయాణం చాలా కష్టతరమైనదని, కేవలం ఒకరు మాత్రమే సిద్ధపడితే సరిపోదని, ఇద్దరూ మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకుని, మెంటల్ గా సిద్ధపడాలని పవిత్ర లోకేష్ వివరించారు. నేటి యువత పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారని, అలాంటి సమయంలో తాము సంతోషంగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. “కలిసి ఉంటే కలదు సుఖం” అనే సూత్రాన్ని నమ్మి వచ్చిన తమకు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నరేష్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

తమ గతానుభవాల గురించి మాట్లాడుతూ, నరేష్ “గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు” అని, తాను “గోల్డెన్ స్పూన్ సంపాదించుకోవడానికి ప్రయత్నించాను” అని పవిత్ర లోకేష్ అన్నారు. వారి మానసిక స్థితిలో ఉన్న తేడాలను అంగీకరిస్తూ.. గతంలోని చేదు అనుభవాల నుండి బయటపడిన తరువాత, వంద శాతం పరిపూర్ణత ఉండదని, అయితే యాభై శాతం అనుకూలత దొరికినప్పుడు, “కంపానియన్” దొరికినప్పుడు, సర్దుబాట్లతో ముందుకు వెళ్లవచ్చని ఆమె వివరించారు. “కొన్నిసార్లు ఆయన, కొన్నిసార్లు నేను సర్దుకుపోతూ ఉంటాం, కానీ కలిసి ఉండాలనే దృఢ సంకల్పం మా ఇద్దరిలో ఉంది” అని పవిత్ర లోకేష్ చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us