Ante Sundaraniki: న్యూయర్ సర్‏ప్రైజ్ ముందే ఇచ్చేసిన నాని.. సుందర్‏ను పరిచయం చేసే టైం వచ్చిందంటున్న న్యాచురల్ స్టార్..

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నాడు. డిసెంబర్ 24న విడుదలైన

Ante Sundaraniki: న్యూయర్ సర్‏ప్రైజ్ ముందే ఇచ్చేసిన నాని.. సుందర్‏ను పరిచయం చేసే టైం వచ్చిందంటున్న న్యాచురల్ స్టార్..
Nani
Follow us

|

Updated on: Dec 30, 2021 | 8:05 PM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నాడు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తుంది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది చివరన శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని.. కొత్త సంవత్సరం కానుకగా మరో సర్‏ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

నాని ప్రస్తుతం అంటే.. సుందరానికీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‏తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు నాని. ఈ మూవీ నుంచి సుందర్‏ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు న్యాచురల్ స్టార్ నాని. శ్యామ్ ఈ ఏడాదిని భారీగా ముగించాడు. ఇక సుందర్ కొత్త సంవత్సరాన్ని సందడితో ప్రారంభించే సమయం వచ్చేసింది. సుందర్‏ను జనవరి 1న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు పరిచయం చేయబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు నాని.

ట్వీట్..

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..