Nani: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన న్యాచురల్ స్టార్… ఏమన్నాడంటే..

|

Sep 15, 2021 | 11:47 AM

హైదరాబాద్‏లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని

Nani: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన న్యాచురల్ స్టార్... ఏమన్నాడంటే..
Nani
Follow us on

హైదరాబాద్‏లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్‏కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

వినాయక చవితికి ఒక్కరోజు ముందు హైదరాబాద్‏లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై ఆత్యాచారానికి పాల్పడి..హత్య చేసిన నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేప్టట్టారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సైదాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి.. సరిహద్దు జిల్లాల్లో గాలింపు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నారి హత్యాచార ఘటనపై సినీప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, మహేష్ బాబు స్పందిస్తూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించారు. తెలంగాణ పోలీస్ ట్వీట్‏ను నాని షేర్ చేసా్తూ.. బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ట్వీట్..

చిన్నారి హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని పట్టుకుని ఎన్‏కౌంటర్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తోంది. ఘటన అనంతరం రాజు.. పారిపోయాడు.. అతడికి సంబంధించిన ఫోటోను పోలీసులు విడుదల చేశారు.

Also Read: Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..