Actor Mohan: స్టార్ హీరోకు ఎయిడ్స్.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన నటుడు.. అసలు ఏమైందంటే..

|

Jun 08, 2024 | 5:47 PM

80'sలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు వరుసగా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతడి గురించి కొన్ని రూమర్స్ ప్రచారమయ్యాయట. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు మోహన్.

Actor Mohan: స్టార్ హీరోకు ఎయిడ్స్.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన నటుడు.. అసలు ఏమైందంటే..
Actor Mohan
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో రూమర్స్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీల పర్సనల్ విషయాల గురించి ఏదోక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న తారలు తమపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తుంటారు. మరికొందరు చూసి చూడనట్లు ఊరుకుంటారు. కానీ ఒకప్పుడు తమ గురించి ప్రచారం జరిగిన అసత్యాలపై ఇప్పుడిప్పుడే పెదవి తెరుస్తున్నారు కొందరు స్టార్స్. తాజాగా ఓ సీనియర్ హీరో గతంలో తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నటుడు మోహన్.. ఒకప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. 80’sలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు వరుసగా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతడి గురించి కొన్ని రూమర్స్ ప్రచారమయ్యాయట. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు మోహన్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్ మాట్లాడుతూ.. “90’s లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నా మీద కొన్ని రూమర్స్ వినిపించాయి. అవి నా కుటుంబాన్ని కూడా బాధపెట్టాయి. అదెంటంటే నాకు ఎయిడ్స్ వచ్చిందని ప్రచారం చేశారు. ఇది విని నా ఫ్యామిలీ, అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఆ సమయంలో నా కుటుంబమే నాకు అండగా నిలబడింది. నాకు ఎయిడ్స్ లేదని క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఆ రూమర్ సృష్టించింది మీడియానే. కాబట్టి వాళ్లే అది తప్పని చెప్పాలని అనుకున్నాను. ఏ సంబంధంలేని నన్ను బలి చేసినప్పుడు పనికి మాలిన రూమర్ గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటీ అనుకున్నాను. అప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది. ” అంటూ చెప్పుకొచ్చాడు.

1980లో మోహన్ హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట్లో తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు. మౌన రాగం, ఇతియకోయిల్, ట్రిప్‌సాగల్ కనతిల్లై, 100వ రోజు, ఉదయ గీతం, మెల్ల అవుతు దూర్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో తూర్పు వెళ్లే రైలు, శ్రవంతి, అనంత రాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి చిత్రాల్లో నటించారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మోహన్.. ఇప్పుడు హర అనే తమిళ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.