Mahesh Babu: అలా ఎందుకు జరిగిందో తెలియదు.. స్జేజ్ పై అందుకే డ్యాన్స్ చేసాను.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

May 22, 2022 | 8:32 AM

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu: అలా ఎందుకు జరిగిందో తెలియదు.. స్జేజ్ పై అందుకే డ్యాన్స్ చేసాను.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mahesh
Follow us on

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) హావా నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది సర్కారు వారి పాట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో చిత్రయూనిట్ పలువురు యూట్యూబర్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే మహేష్ (Mahesh babu ).. తాను స్టేజ్ పై డ్యాన్స్ చేయడానికి గల కారణాన్ని వివరించారు.

కర్నూలులో మీరు స్టేజీ పైకి ఎక్కి డ్యాన్స్ చేశారు కదా.. అస్సలు మీరు అలా ఎందుకు చేశారు ? అని అడగ్గా.. మహేష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.. “అది ఎందుకు అలా జరిగిందో నాక్కూడా తెలియదు.. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీం మొత్తం షాక్.. సర్ ప్రైజ్ లో ఉండిపోయింది.. రెండేళ్లు కష్టపడి సినిమా చేశాం.. దానికి అభిమానుల నుంచి వస్తోన్న ఆదరణ చూశాక.. స్జేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది.. అందుకే చేశాను ” అంటూ చెప్పుకొచ్చారు మహేష్.. అలాగే.. సినిమాలో కీర్తి సురేష్ తనను తిట్టే సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు మర్చిపోలేదని.. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్విందన్నారు మహేష్ బాబు…