Actor Karthi: హీరో కార్తీకి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.. డాక్టర్లు ఏమన్నారంటే?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి తెలుగు ఆడియెన్స్ కు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న కార్తీ గాయపడ్డాడు. దీంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Actor Karthi: హీరో కార్తీకి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.. డాక్టర్లు ఏమన్నారంటే?
Actor Karthi

Updated on: Mar 04, 2025 | 6:48 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజి బిజీగా ఉంటున్నాడు. గతేడాది మైయళగన్ (తెలుగులో సత్యం సుందరం) వంటి ఫీల్ గుడ్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు కార్తీ. అలాగే సూర్య కంగువాలోనూ ఓ స్పెషల్ క్యామియో రోల్ లో మెరిశాడు. ప్రస్తుతం సర్దార్ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కార్తీ అనుకోకుండా గాయపడ్డాడు. సినిమా షూటింగ్ లో భాగంగా అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం సర్దార్ 2 సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. కార్తీ కాలికి తీవ్రగాయమైంది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న హీరోను చిత్ర బృందం వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. కార్తీని పరీక్షించిన వైద్యులు 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

కార్తీకి ప్రమాదం జరిగిందన్న విషయం బయటికి తెలియడంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చెన్నైలోని అతని ఆఫీసుకు వేలాది మంది ఫోన్లు చేసి, కార్తీ క్షేమ సమాచారం కనుక్కున్నారు. అయితే కార్తీ క్షేమంగానే ఉన్నాడని తెలియడంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కార్తీ గాయపడడంతో సర్దార్ 2 సినిమా షూటింగ్ కు విరామం ప్రకటించింది చిత్ర బృందం. కార్తీ కోలుకున్న వెంటనే మళ్లీ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది. కాగా గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా సర్దార్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇవి కూడా చదవండి

 

పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తోన్న ఈ స్పై, యాక్షన్ థ్రిల్లర్ లో కార్తీ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఎస్జే సూర్య, రజిశా విజయన్ తదితరులు కీలక పాత్ర లు పోషిస్తున్నారు. కాగా సర్దార్ 2 తర్వాత ఖైదీ 2 సినిమాలో కార్తీ నటించాల్సి ఉంది.

కొత్త సినిమాలో కార్తీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి