AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 Ad : కేవలం 7నిమిషాల 4సెకన్ల పాత్రకు కమల్ హాసన్ అన్ని కోట్లు అందుకున్నాడా..!!

ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ మూవీ అశ్వత్థామ  పాత్రలో నటించారు. అలాగే కమల్ హాసన్ విలన్ గా కనిపించారు. ఆయన పాత్ర పేరు యాస్కిన్. సినిమాలో తొలిసారి కనిపించినప్పుడు వృద్ధుడిలా కనిపిస్తాడు. చూసిన వారికి ముసలి విలన్ అని అనుకుంటున్నారు. అయితే సినిమా చివర్లో ఆయన పాత్ర నిజస్వరూపం తెలిసిపోతుంది. దానికి కారణం ఉంది. అదేంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Kalki 2898 Ad : కేవలం 7నిమిషాల 4సెకన్ల పాత్రకు కమల్ హాసన్ అన్ని కోట్లు అందుకున్నాడా..!!
Kalki 2898 Ad
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2024 | 6:52 PM

Share

‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ స్క్రీన్ పై అదరగొట్టేశారు. ఫలితంగా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకుంది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరు.. తమ అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగేఈ సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించింది చాలా తక్కువే కానీ భారీ రెమ్యూనరేషన్ అందుకుంది.

ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ మూవీ అశ్వత్థామ  పాత్రలో నటించారు. అలాగే కమల్ హాసన్ విలన్ గా కనిపించారు. ఆయన పాత్ర పేరు యాస్కిన్. సినిమాలో తొలిసారి కనిపించినప్పుడు వృద్ధుడిలా కనిపిస్తాడు. చూసిన వారికి ముసలి విలన్ అని అనుకుంటున్నారు. అయితే సినిమా చివర్లో ఆయన పాత్ర నిజస్వరూపం తెలిసిపోతుంది. దానికి కారణం ఉంది. అదేంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమాలో కమల్ హాసన్ పాత్ర కేవలం మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సినిమా ముగిసే సన్నివేశంలో కమల్ హాసన్ కనిపిస్తారు. సినిమా రెండో భాగం కూడా ఉండటంతో సినిమా చివరిలో ట్విస్ట్ ఉంటుంది. అయితే మొదటి భాగంలో అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో పాత్రలోని బలాన్ని చూపించాడు. రెండో భాగంలో విలన్ పాత్ర ఆధారంగా కథ మొత్తం సాగుతుంది.

మొదటి పార్ట్ లో ఆయన పాత్ర చిన్నగా, నెగిటివ్ రోల్ గా ఉన్నప్పటికీ కమల్ ఒప్పుకోవడం గొప్ప విషయం.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటించేందుకు కమల్‌హాసన్‌కు 20 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కల్కి’ సినిమాలో కమల్ హాసన్ కనిపించేది కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే కమల్ హాసన్ కి 20 కోట్లు ఇచ్చారు  సినిమా నిర్మాత అశ్వినీదత్. ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ కనిపించిన నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర షూటింగ్ చాలా రోజులైంది. నిర్మాత అశ్వినీదత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయింది. 40శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది గ్రీన్ మ్యాట్ షూటింగ్ కావడంతో, నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్ర షూటింగ్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కారణంగా కమల్‌కు 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..