
నటుడిగా సుపరిచితులైన హర్షవర్ధన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు మూవీలోనూ తనదైన నటనతో అలరించారు. అయితే ఇన్నాళ్లు నటుడిగా మెప్పించిన ఆయన దర్శకుడిగానూ ప్రయత్నించారు. ఆయన తన తొలి దర్శకత్వ ప్రయత్నం గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి, దాని విడుదలలో జాప్యం వెనుక గల కారణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో, కన్నడ కిషోర్, మురళి కీలక పాత్రల్లో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం 2018లోనే పూర్తయినప్పటికీ, ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ చిత్రానికి హర్షవర్దన్ దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ, “మామ మశ్చింద్ర కన్నా ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేశాను. ఇది 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ ఫిల్మ్. పూర్తి వినోదాత్మకంగా, అనేక ట్విస్టులు, సర్ప్రైజ్ లతో ఉంటుంది. దీనికి నేనే సంగీతం కూడా అందించాను,” అని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
అయితే, “కొంతమంది తప్పుడు వ్యక్తులు, సరైన అవగాహన లేని నిర్మాత చేతిలోకి వెళ్లడం వల్లే సినిమా విడుదలలో సమస్యలు వచ్చాయి,” అని ఆయన వివరించారు. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టడం మాత్రమే కాదని, అది ఒక ప్రత్యేకమైన కళ అని, చేతిలో రూపాయి లేకపోయినా సరైన ప్రొడ్యూసర్ సినిమా తీయగలడని అన్నారు. తన దర్శకత్వ ఆశయం గురించి చెబుతూ, రాజమౌళి గారు శాంతినివాసం సీరియల్ సమయంలో తనను దర్శకుడిగా మార్చారని, రాఘవేంద్ర రావు గారి పర్మిషన్ తో అది సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. అమృతంలో శివాజీ రాజా డైరెక్ట్ చేసిన ఎపిసోడ్లు కాకుండా, తాను కూడా కొన్ని ఎపిసోడ్లు డైరెక్ట్ చేశానని పేర్కొన్నారు. తన క్రాఫ్ట్ పై తనకు నమ్మకం ఉందని, దాన్ని ఎలా నిరూపించుకోవాలి అన్నదే తన ప్రయత్నమని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
నటుడు సుధీర్ బాబు తనపై ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండేవారని, రైటర్-డైరెక్టర్ గా తాను బాగా రాణిస్తానని ఆయన భావించేవారని హర్షవర్ధన్ తెలిపారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చేసే ముందు సుధీర్ బాబు “హర్ష చిన్న సినిమా చేయొద్దు, రిలీజ్ అవ్వడం చాలా కష్టం,” అని చెప్పిన మాటలు నిజమయ్యాయని ఒప్పుకున్నారు. ఆ సినిమా విడుదల కాకపోవడంపై సుధీర్ బాబు కూడా నిరాశ చెందారని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..