Ajith Kumar: అభిమానులకు అజిత్ సలహా.. వైరల్ అవుతోన్న స్టార్ హీరో ఎమోషనల్ వీడియో

|

Jan 12, 2025 | 8:45 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినీ ప్రయాణం చాలా ప్రత్యేకం. సినిమా ఈవెంట్స్, ప్రమోషన్స్ కు దూరంగా ఉంటాడు. అభిమానులతో మీటింగ్స్, మీడియా ప్రెస్ మీట్స్ ఇలాంటివి అజిత్ కు అసలు సంబంధమే ఉండదు. అయినా ఈ స్టార్ హీరో సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. విడుదలకు ముందే అజిత్ సినిమాలపై ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. ఈ ఏడాది తునీవు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు విదాయముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నాడు

Ajith Kumar: అభిమానులకు అజిత్ సలహా.. వైరల్ అవుతోన్న స్టార్ హీరో ఎమోషనల్ వీడియో
Ajith
Follow us on

తమిళ్ స్టార్ హీరో అజిత్. ఇటీవలే ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్‌లోని కార్ రేసింగ్ వేదిక నుంచి అజిత్ కుమార్ తన అభిమానులకు ఇచ్చిన సలహా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నటుడు అజిత్ నటించిన ‘తునీవు’ చిత్రం ఎట్టకేలకు 2023 పొంగల్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. బ్యాంక్ హీస్ట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది ఈ సినిమా. ఈ చిత్రం తరువాత, అజిత్ కుమార్ లైకా సంస్థ నిర్మాణంలో మిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన విదాయముర్చి చిత్రంలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఈ చిత్రం గతేడాది దీపావళికి విడుదల చేయాలని భావించినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది.

ఇదిలా ఉంటే, అజిత్ కుమార్ తన తదుపరి చిత్రానికి ప్రముఖ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు విడుదలై అభిమానులను ఆనందపరిచాయి. సినిమాల షూటింగ్‌ల విరామంలో అజిత్ తన కార్ రేసింగ్‌పై దృష్టి సారించాడు. దుబాయ్‌లో జరిగే 24 హెచ్ మరియు యూరోపియన్ 24 హెచ్ ఛాంపియన్‌షిప్ కార్ రేస్‌లో అజిత్ టీమ్ లీడర్, డ్రైవర్‌గా పాల్గొంటున్నారు.

అజిత్ కార్ రేస్‌లో పాల్గొనడం లేదని ఇప్పుడు ప్రకటించారు. అలాగే అజిత్ తన అభిమానులకు  ఎమోషనల్ సలహా ఇస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా మంది అభిమానులు వస్తున్నారు.. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అయితే నేను చెప్పాల్సింది, చెప్పాలనుకున్నది ఒక్కటే. మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతితో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ కుటుంబ సమయాన్ని వృధా చేయకండి. బాగా చదవండి, కష్టపడి పని చేయండి. మనకు ఆసక్తి ఉన్న పనిలో మనం పాల్గొని విజయం సాధిస్తే అది చాలా మంచిది. కానీ విజయం సాధించకపోతే నిరుత్సాహపడకండి. పోటీ చాలా ముఖ్యం. సంకల్పం , అంకితభావాన్ని వదులుకోవద్దు. లవ్ యూ ఆల్… లవ్ యూ ఆల్ అన్ కండిషన్లీ… టేక్ కేర్ అని అజిత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.