AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: సినిమా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన హీరో.. అజిత్ ధైర్యానికి హాట్సాఫ్..

ఇప్పుడు విదా ముయర్చి సినిమాలో నటిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు. గతంలో విదాముయర్చి యాక్షన్ సీన్ కోసం స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అజిత్ నడిపిన కారు ఏకంగా గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాడు.

Ajith Kumar: సినిమా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన హీరో.. అజిత్ ధైర్యానికి హాట్సాఫ్..
Ajith Kumar
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2024 | 10:47 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో అజిత్ చాలా ప్రత్యేకం. ఇప్పటికీ సొంతంగా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో. అలాగే సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ.. తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ప్రశాంతంగా గడుపుతున్నాడు. అలాగే ఇటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతోనూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది తునీవు సినిమాతో పలకరించిన అజిత్… ఇప్పుడు విదా ముయర్చి సినిమాలో నటిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు. గతంలో విదాముయర్చి యాక్షన్ సీన్ కోసం స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అజిత్ నడిపిన కారు ఏకంగా గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాడు.

ఇక ఇప్పుడు మరోసారి విదాముయర్చి సినిమా యాక్షన్ సీన్ షూటింగ్ వీడియోను పంచుకుంది చిత్రయూనిట్. ఆ వీడియోలో కారును క్రేన్ సహాయంతో గాల్లోకి లేపారు. కారు గాల్లో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్ తోపాటు.. మరో నటుడు ఆరవ్ కూడా ఉన్నారు. క్రేన్ సాయంతో గాల్లోకి లేపిన తర్వాత అక్కడే కొన్ని పల్టీలు కొట్టించారు. ఆ సమయంలోనూ ఇద్దరూ స్టార్స్ కార్లోనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం చాలా ప్రమాదకరం. అందులోనూ స్టార్ హీరో ఎలాంటి డూప్ సాయం లేకుండా అదే కారులో ఉండడం చూసి చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. విదాముయర్చి సినిమా కోసం అజిత్ చేసే స్టంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సినిమా కోసం ప్రాణమివ్వడమంటే ఇదే.. అజిత్ అందుకే నీకు అంతగా అభిమానులు ఉన్నారు.. నువ్వు రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అజిత్, ఆరవ్ తోపాటు త్రిష, రెజీనా, అర్జున్ సర్జా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు అజిత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us