టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ (Major) సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది. తెలుగు, హిందీ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్.. టికెట్స్ ఎన్ని సేల్ అయ్యాయనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు హీరో అడివి శేష్. అలా విడుదల చేయడం పై కూడా క్లారిటీ ఇచ్చాడు.
మేజర్ సినిమా అధ్భుతమైన కలెక్షన్స్ గురించి నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని ప్రజలు అడుగుతున్నారు.. ఎందుకంటే మేజర్ సినిమా రెగ్యులర్ మూవీ కాదు.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను రెండు మిలియన్ల మంది వీక్షించారు.. అందుకే ఈ సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను.. మేజర్ సందీప్ ఎంతమంది హృదయాలను హత్తుకున్నాడో తెలుసుకోవాలనుకున్నాను.. ఇండియా లవ్స్ మేజర్ అంటూ పోస్ట్ చేశాడు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇండియా మొత్తం మేజర్ సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు మేజర్ సినిమా దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాష్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత దుళీపాళ్ల కీలకపాత్రలలో నటించారు.
People ask why I’m posting about #Major ‘s s amazing Collections. That #Major is not a regular film
TWO MILLION people watched and loved the story of #MajorSandeepUnnikrishnan
THAT is why I spoke about it. For you to know how many hearts he has touched. #IndiaLovesMajor ?? pic.twitter.com/G2tTlRauCQ
— Adivi Sesh (@AdiviSesh) June 6, 2022